కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, పూజా హెగ్డే జంటగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా బీస్ట్. సన్ పిక్చర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 13, 2022 న రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య రిలీజ్ కానున్న ఈ సినిమా ట్రైలర్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక అభిమానుల ఎదురుచూపులకు తెర తీశారు. ఎట్టకేలకు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కి మేకర్స్ డేట్ ఫిక్స్ చేశారు. బీస్ట్ థియేట్రికల్ ట్రైలర్‌ను ఏప్రిల్ 2 న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.
ఇక దీంతో అభిమానులు రచ్చ షురూ చేశారు. కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. పలు భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రంలో విజయ్ తన విశ్వరూపాన్ని చూపించాడని టాక్ వినిపిస్తోంది. మరి ట్రైలర్ లో విజయ్ ఏ రేంజ్ లో కనిపించబోతున్నాడో చూడాలంటే మరో మూడు రోజులు ఆగాల్సిందే.
The much-awaited #BeastTrailer is releasing on April 2nd @ 6 PM
— Sun Pictures (@sunpictures) March 30, 2022
Namma aattam inimey vera maari irukum 🔥@actorvijay @Nelsondilpkumar @anirudhofficial @hegdepooja @selvaraghavan @manojdft @Nirmalcuts @anbariv #BeastTrailerOnApril2 #BeastModeON #Beast pic.twitter.com/EtpNDVKv4L