Vijay: ఇళయ దళపతి విజయ్ ప్రస్తుతం వారసుడు సినిమాతో తమిళ్ లో ఓ మంచి విజయాన్ని అందుకున్నాడు కానీ, తెలుగులో మాత్రం ఓ మోస్తరు విజయాన్ని కూడా అందుకోలేకపోయాడు. ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే విజయ్ నెట్ వర్త్ ఇంత అంటూ కోలీవుడ్ లో వార్తలు వైరల్ గా మారాయి. దిల్ రాజు చెప్పినట్లు కోలీవుడ్ స్టార్ హీరోగా విజయ్ రేంజ్ వేరు.. అజిత్ కన్నా ముందు అంటే విజయ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. విజయ్ అసలు పేరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. 1984 లో తన తండ్రి SA చంద్రశేఖర్ చిత్రం `వెట్రి`తో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. అంచలంచెలుగా విజయ్ ఎదిగిన విధానం ఎంతో స్ఫూర్తిదాయకం. ఇక ప్రస్తుతం కోలీవుడ్ లో టాప్ 1 హీరోగా విజయ్ వెలుగొందుతున్నాడు.
విజయ్ ఆస్తుల విలువ అక్షరాలా 445 కోట్లు అని కోలీవుడ్ టాక్ నడుస్తోంది. భారతీయ సినీపరిశ్రమలో అత్యంత సంపన్న నటులలో విజయ్ ఒకడు. దాదాపు 445 కోట్లు నికర ఆస్తులతో విజయ్ ఉన్నాడట. బంగ్లాలు, తోటలు, ఎస్టేట్ లు, వ్యాపారాలు, సముద్రతీరంలోని బంగ్లా.. ఖరీదైన కార్లు మొత్తం కలిపి ఈ ఏడాది నికర ఆదాయం ఇంత వచ్చిందని చెప్పుకొస్తున్నారు. సినిమాలు, ప్రకటనల ద్వారా విజయ్ ఇంత సంపాదించాడట. గూగుల్ ద్వారా ఈ విషయాలను అభిమానులు సెర్చ్ చేస్తున్నారు. సంవత్సరానికి రూ-120 నుండి 150 కోట్ల వరకు సంపాదిస్తున్నాడు. ఇక ఒక సినిమాకు రూ. 100 కోట్లు తీసుకుంటున్నాడని కూడా అంటున్నారు. అంతెందుకు.. దిల్ రాజు సైతం.. వారసుడు సినిమాకు దాదాపు రూ. 100 కోట్లు ఇచ్చాడని టాక్ నడుస్తోంది. ఇక మరోపక్క విజయ్ ప్రకటనల ద్వారా రూ. 10 కోట్లు అందుకుంటున్నాడట. అయితే విజయ్ ఎలాంటి ప్రకటనలు పడితే అలాంటివి చేయడు. కేవలం ఇంటర్నేషనల్ బ్రాండ్స్ మాత్రమే చేస్తాడు. ఒక్కో ప్రకటనకు రూ. 10 కోట్లవరకు అందుకుంటాడట. చెన్నైలోని నీలంకరై పరిసరాల్లోని క్యాజురినా డ్రైవ్ వీధిలో ఒక ఇల్లు.. రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారు, BMW X5 -X6 అలాగే BMW X5 అండ్ X6.. ఆడి A8 L ల్యాండ్ రోవర్, రేంజ్ రోవర్ ఎవోక్.. ఫోర్డ్ ముస్తాంగ్ …వోల్వో XC90, మెర్సిడెస్ బెంజ్ GLA కార్లను ఉపయోగిస్తున్నాడట. ఇక విజయ్ ఆస్తుల విలువ చూసి అభిమానులు నోళ్లు నొక్కుకుంటున్నారు.