Vijay Devarakonda : విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ కింగ్ డమ్ త్రినాథ రావు నక్కిన డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీకి మంచి హైప్ ఉంది. ఈ మూవీ జులై 4న థియేటర్లలోకి రాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. విజయ్ దేవరకొండ ఈ మూవీ ప్రమోషన్లలో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్.. ట్యాక్సీవాలా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ట్యాక్సీవాలా సినిమా గురించి నాకు రాహుల్ సాంకృత్యన్ కథ చెప్పి నప్పుడే చాలా నవ్వుకున్నాను. ఆ మూవీ కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకంతోనే చేశాం. ప్రతి సీన్ అయిపోయిన వెంటనే మానిటర్ లో చూసి నవ్వుకున్నాం.
Read Also : Rain Alert: మరికాసేపట్లో ఏపీ, తెలంగాణలో భారీ వర్షం..
ఆ మూవీ షూట్ అయిపోయిన తర్వాత నాకు ప్రొడ్యూసర్లు ఫోన్ చేశారు. వాళ్ల వాయిస్ లో సీరియస్ నెస్ కనిపించింది. ఏమందో అని టెన్షన్ పడ్డాను. ఆ మూవీ ఔట్ పుట్ చూస్తే నాకు అస్సలు నచ్చలేదు. వాళ్లు ఈ మూవీని ఆపేద్దాం. వేరే మూవీని గ్రాండ్ గా రిలీజ్ చేద్దాం అన్నారు. ఎందుకంటే మూవీకి బీజీఎం కరెక్ట్ గా లేదు. అప్పుడు నేను, డైరెక్టర్ కలిసి వేరే మ్యూజిక్ డైరెక్టర్ ను తీసుకొచ్చింది బీజీఎం ఇప్పించాం. అప్పుడు రిలీజ్ చేస్తే మంచి హిట్ అయింది. నా నమ్మకం నిలబడింది. అల్లు అరవింద్ గారు ఆ విషయంలో నన్ను నమ్మారు. ఆయన నమ్మకాన్ని నేను నిలబెట్టుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు విజయ్. ఇక కింగ్ డమ్ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి.
Read Also : Karali : ‘కరాలి’ మొదలెట్టిన నవీన్ చంద్ర