Vijay- Rashmika : విజయ్ దేవరకొండ-రష్మిక ఎంగేజ్ మెంట్ చేసుకున్నారనే వార్తలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. దాని గురించి అడిగితే వీరిద్దరూ స్పందించట్లేదు. కానీ ఈవెంట్లో ఇద్దరు చేస్తున్న పనులు అందరికీ షాకింగ్ గా అనిపిస్తున్నాయి. మొన్న ఓ ఈవెంట్ లో రష్మికను ఎంగేజ్ మెంట్ గురించి అడిగితే మీరేం అనుకుంటే అదే నిజం అంటూ చెప్పింది. కానీ నిజమో కాదో చెప్పలేదు. ఇక రష్మిక దేవరకొండ అని ఫ్యాన్స్ అరిస్తే స్మైల్ ఇచ్చి ఊరుకుంటుంది. ఇక విజయ్ కూడా హింట్స్ మాత్రమే ఇస్తున్నాడు.
Read Also : Vijay Devarakonda : ఆ పని చేస్తూ శభాష్ అనిపించుకుంటున్న విజయ్..
నిన్న ది గర్ల్ ఫ్రెండ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన విజయ్.. అందరి ముందే రష్మిక చేతికి ముద్దు పెట్టాడు. రష్మిక కూడా స్మైల్ ఇచ్చింది. అంతే తప్ప అసలు నిజం ఏంటనేది మాత్రం చెప్పలేదు వీరిద్దరూ. వీరి చేష్టలు చూసిన అభిమానులు.. ఇవన్నీ ఎందుకు అసలు నిజం చెప్పేయొచ్చు కదా ఎందుకు ఇదంతా అని అంటున్నారు. ఎన్ని రోజులు దాచిపెట్టినా అసలు నిజం ఎప్పుడో ఒకసారి చెప్పాల్సిందే కదా. దానికి ఇదంతా చేయడం ఎందుకు అని అంటున్నారు. మరి ఈ జంట ఎప్పుడు బయట పెడుతుందో చూడాలి.