Vijay Devarakonda : విజయ్ దేవరకొండ ఈ నడుమ సక్సెస్ మీట్లకు వస్తూ అందరినీ సపోర్ట్ చేస్తున్నాడు. ఎవరు పిలిచినా సరే సినిమాల ఈవెంట్స్ కు వెళ్తున్నాడు. వీళ్లకు వెళ్లాలా వద్దా అనే అనుమానాలు ఏవీ పెట్టుకోవట్లేదు. మనసులో ఎలాంటివి పెట్టుకోకుండా ఎవరు పిలిచినా సరే వెళ్లి వాళ్లను ఉత్సాహపరుస్తున్నారు. సినిమా రిలీజ్ కు ముందు ఈవెంట్ కు పిలిచినా.. లేదంటే సక్సెస్ సెలబ్రేషన్స్ కు పిలిచినా వెళ్తున్నాడు. ఆ మధ్య సూర్య నటించిన రెట్రో మూవీ ఈవెంట్ కు వచ్చి విష్ చేశాడు. ఆ తర్వాత లిటిల్ హార్ట్స్ సినిమా టీమ్ ను తన ఇంటికి పిలిచి అభినందించాడు.
Read Also : Kantha : దుల్కర్ సల్మాన్ కాంత మూవీ స్ట్రీమింగ్ పార్ట్ నర్ ఫిక్స్
ఆ తర్వాత ఆ సినిమా ఈవెంట్ కు కూడా వెళ్లి కంగ్రాట్స్ చెప్పాడు. దీంతో పాటు మొన్న ది గర్ల్ ఫ్రెండ్ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ కు వెళ్లి కంగ్రాట్స్ చెప్పాడు. దాని తర్వాత కూడా కొన్ని ఈవెంట్లకు వెళ్తూ వారిని విష్ చేస్తున్నాడు. తన సినిమాలతో ఎంత బిజీగా ఉంటున్నా సరే విజయ్ ఇలా అందరికీ అండగా నిలబడుతున్నాడు. తన వంతు సాయం చేస్తున్నాడు. సాధారణంగా హీరోలు ఇలా ఎవరి సినిమాలకు పడితే వారికి అసలే రారు. కేవలం వాళ్లకు సంబంధించిన వారి మూవీలకే వస్తారు. కానీ విజయ్ అలా ఆలోచించకుండా అందరి మనసులు గెలుచుకుంటున్నాడు.