Vijay Deverakonda -Gowtam Tinnanuri film shoot begins today: విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ అనే సినిమాతో చివరిగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా దారుణమైన డిజాస్టర్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో ఆయన ఆచితూచి సినిమాలు ఎంపిక చేసుకుంటున్నాడు. ఇప్పటికే విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ డైరక్షన్ లో ఖుషి అనే సినిమా తెరకెక్కుతోంది. సమంత హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. కాశ్మీర్లో జరిగే ఒక అందమైన ప్రేమ కథగా దీన్ని తెరకెక్కిస్తున్నట్లు ప్రచారం అయితే ఉంది. కానీ సినిమా రిలీజ్ అయితే కానీ పూర్తి అవగాహన వచ్చే అవకాశం లేదు. ఇక ఈ సినిమా ఇలా ఉండగానే విజయ్ దేవరకొండ మరిన్ని సినిమాల లైన్లో పెట్టారు.
గౌతం తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమా పరుశురాం దర్శకత్వంలో ఒక సినిమా కూడా విజయ్ దేవరకొండ గ్రాండ్గా ఓపెనింగ్ జరిపారు. ఇక టాలీవుడ్ వర్గాల సమాచారం మేరకు విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి సినిమా షూటింగ్ ఈరోజు ప్రారంభమైంది. విజయ్ దేవరకొండ మొదటి రోజు షూటింగ్లో జాయిన్ అయ్యారు. ఈ సినిమా ఒక స్పై థ్రిల్లర్ అని విజయ్ దేవరకొండ పోలీస్ అధికారి పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన శ్రీ లీల హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న 12వ సినిమా. ఇక 13వ సినిమాలో హీరోయిన్గా మృణాల్ ఠాకూర్ ని ఎంపిక చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఆ సినిమాని దిల్ రాజు నిర్మించేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి.