Vijay Deverakonda Finally opens up on his marriage: ఖుషీ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో తన పెళ్లి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ఖుషి అనేదొక అమేజింగ్ ఫిల్మ్ అని క్యూట్ లవ్ ఫిల్మ్ అని అన్నారు. దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు మా కథకు కనెక్ట్ అవుతారని ఆయన అన్నారు. మన సంప్రదాయాలు, కుటుంబ బంధాలు, వివాహ వ్యవస్థ వంటి అంశాలతో ముడిపడిన సినిమా ఇదన్న ఆయన ఇలాంటి చిత్రంలో భాగమవడం సంతోషంగా ఉందని అన్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా మన కథలను చూపించే అవకాశం దక్కుతోంది ఇలాంటి టైమ్ లో నేను హీరోగా ఉండటం అదృష్టంగా, గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. పరస్పరం అర్థం చేసుకోవడం, ప్రేమను పంచడం ఈ రెండు క్వాలిటీస్ జీవిత భాగస్వామికి ఉండాలని పేర్కొన్న ఆయన కష్ట సుఖాల్లో ఒకరికి మరొకరు సపోర్ట్ గా నిలవాలని అన్నారు. అప్పుడే బంధాలు నిలుస్తాయని అన్నారు.
Vijay Devarakonda: అదే జరిగితే.. హైవేపై సమంత పేరుతో ఇడ్లీ బండి పెట్టుకోవడమే
నిజానికి నాకు ఆ మధ్య ప్రేమ కథల మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయింది కానీ ఖుషి కథ విన్న తర్వాత బ్యూటిఫుల్ ఫీల్ కలిగిందని, మళ్లీ ప్రేమ కథల్లో నటించాలనే ఆసక్తి కలిగిందని అన్నారు. ఒకప్పుడు నా దగ్గర ఎవరూ పెళ్లి మాట ఎత్తేవారు కాదు కానీ ఈ మధ్య నా స్నేహితులు పెళ్లి చేసుకోవడం, వాళ్ల జీవితాలు చూస్తుంటే నాకు పెళ్లి మీద అయిష్టం పోయిందని అన్నారు. వివాహం అనేది జీవితంలో ఒక ముఖ్యమైన ఛాప్టర్ అని మరో రెండు మూడేళ్ళలో నేనూ ఆ ఛాప్టర్ లోకి అడుగుపెడతానని అప్పుడు అందరికీ చెబుతానని అన్నారు. తమిళంలో నాకు నచ్చిన దర్శకులు చాలా మంది ఉన్నారని అవకాశం వస్తే వాళ్లతో తప్పకుండా సినిమా చేస్తానని అన్నారు. ‘ఖుషి’ హాఫ్ పార్ట్ షూట్ చేసే టైమ్ కు సమంతకు హెల్త్ బాగాలేదని, ఆమె కోసం ఆరు నెలలు కాదు సంవత్సరం అయినా వెయిట్ చేద్దామని అనుకున్నామని అన్నారు. అయితే సమంత కోలుకుంటే చాలనుకున్నామని అన్నారు.