Vijay Devarakonda: విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన చిత్రం ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. సెప్టెంబర్ 1 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ జోరును పెంచేశారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఖుషి ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ, శివ నిర్వాణ, నిర్మాతలు పాల్గొన్నారు. అనారోగ్యం కారణంగా సమంత ప్రమోషన్స్ కు రాలేదని విజయ్ తెలిపాడు. ఇక సినిమా గురించి జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు చెప్పారు.
Vijay Deverakonda: ఇక ఇప్పుడు ఆ ఒక్కటీ నా వల్ల కాదు అంటున్న విజయ్ దేవరకొండ
ఇక ఈ ఈవెంట్ లో విజయ్.. సమంత గురించి మాట్లాడుతూ “ఈ సినిమాలో ఆరాధ్య క్యారెక్టర్‌లో సమంతను కాకుండా ఇంక ఎవ్వరిని ఊహించుకోలేదు. సామ్ కు హెల్త్ బాలేకపోయినా ఈ సినిమా పూర్తిచేసినందుకు అందరి ముందు సమంతకు థాంక్స్ చెప్తున్నాను.ఖుషి హాఫ్ పార్ట్ షూట్ చేసే టైమ్ కు సమంతకు హెల్త్ బాగాలేదు. ఆమె కోసం ఆరు నెలలు కాదు సంవత్సరం అయినా వెయిట్ చేద్దామని అనుకున్నాం. సమంత కోలుకుంటే చాలనుకున్నాం. ఒకవేళ తను క్యూర్ అయ్యేందుకు పదేళ్లు పట్టినా..ఈ కథను మరోలా మార్చి ..పదేళ్ల తర్వాత సినిమా చేయాలనుకున్నాం. ఈ సినిమాకు సమంత చేసిన కాంట్రిబ్యూషన్ మాకు తెలుసు. కానీ ఎన్ని ఇబ్బందులు ఉన్నా..ఆమె వచ్చి సినిమా పూర్తి చేసింది. అయితే ఇక్కడ మీకో విషయం విషయం చెప్పాలి. షూటింగ్ జరుగుతున్న సమయంలో సామ్ మయోసైటిస్‌తో బాధపడుతోంది కాబట్టి షూటింగ్ మధ్యలో ఆపేసి మళ్లీ పదేళ్ల తర్వాత సినిమాను తీస్తే ఎలా ఉంటుంది అని అడిగాను. అప్పుడు శివ నిర్వాణ ఈ పదేళ్లలో విజయవాడ హైవే మీద సమంత పేరుతో ఓ ఇడ్లీ బండి పెట్టుకుని అమ్ముకుందామా అని అన్నాడు” అంటూ నవ్వేశాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.