Telugu Film Journalist Association (TFJA) Health and ID Cards distribution: తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ డైరీ, ఐడి మరియు హెల్త్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిన్న రాత్రి ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టార్ హీరో విజయ్ దేవరకొండ, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు, పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి, TUWJ ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ క్రమంలో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) గత 20 సంవత్సరాలుగా చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను అధ్యక్షుడు వి.లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి వై.జె.రాంబాబు, కోశాధికారి నాయుడు సురేంద్ర కుమార్ వివరించారు.
Tollywood – Remake: ఏకంగా 9 భాషల్లో రీమేక్ అయిన తెలుగు సినిమా.. ఇప్పటికి అదే రికార్డ్..!
ఇక తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్(TFJA).. సభ్యుల సంక్షేమం కోసం వారి ఆరోగ్యం, కుటుంబ సభ్యుల బాగోగులను చూస్తూ ప్రతి సంఘ సభ్యుడికీ ఇంటి పెద్దలా అండగా నిలుస్తూ వస్తోంది టిఎఫ్‌జేఏ. ఇందులో చేరిన ప్రతి సభ్యుడి కుటుంబానికి రూ. 5 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యంతో, కుటుంబ సభ్యులకు రూ.5 లక్షలు ఆరోగ్య భీమా సౌకర్యం కల్పిస్తోంది. ఇక అదే విధంగా ఒక్కో సభ్యుడికి టర్మ్ పాలసీ రూ.15 లక్షలు, యాక్సిడెంటల్ పాలసీ సభ్యుడికి రూ.25 లక్షలను అందేలా చర్యలు తీసుకున్నారు.ఇక ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ, ఆర్.నారాయణమూర్తి, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, టీఎఫ్‌జెఎ అధ్యక్షుడు లక్ష్మీ నారాయణ, జనరల్ సెక్రటరీ వై.జె.రాంబాబు, ట్రెజరర్ సురేంద్ర నాయుడు సహా అసోసియేషన్ కమిటీ మెంబర్లు, సభ్యులు ఇతర జర్నలిస్ట్‌లు పాల్గొన్నారు.