2005లో ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా. సిద్ధార్థ, త్రిష హీరోహీరోయిన్ లుగా నటించిన ఈ సినిమా మొత్తం తొమ్మిది భాషల్లో రీమేక్ అయింది. ఏ సూపర్ హిట్ సినిమా అయినా సరే కేవలం రెండు లేదా మూడు భాషల్లో రీమేక్ అవడం చూస్తుంటాం. మరి అయితే నాలుగు లేదా ఐదు భాషల్లో పెద్ద హీరోల సినిమాలు రీమేక్ కావడం చూస్తూ ఉంటాం. కాకపోతే మొదటగా తెలుగులో విడుదలైన నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా మాత్రం ఏకంగా తొమ్మిది భాషల్లో రీమేక్ జరిగింది. ఇక ఇప్పటికీ అత్యధిక భాషలో రీమేక్ అయిన ఇండియన్ సినిమాగా నువ్వొస్తానంటే నేనొద్దంటానా రికార్డ్ నెలకొల్పింది.
Also Read: Ajith Kumar : ఏంటి అజిత్.. నువ్వు కూడా ఇలా షాక్ ఇస్తావేంటి?
తెలుగులో విక్టరీ వెంకటేష్ నటించిన దృశ్యం, హిందీలో అమితాబ్ నటించిన డాన్ సినిమాలో కూడా ఈ రికార్డును బ్రేక్ చేయలేకపోయాయి. దృశ్యం సినిమాని మోహన్ లాల్ మొదటగా మలయాళంలో నటించి విడుదల చేయగా.. ఆ తర్వాత ఆ సినిమాని 8 భాషలలో రీమేక్ చేశారు. అలాగే డాన్ సినిమా కూడా కేవలం 5 భాషల్లో మాత్రమే రీమేక్ చేశారు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా రిలీజ్ అయ్యి 19 సంవత్సరాల గడుస్తున్న.. ఇప్పటికీ ఆ రికార్డు ను ఏ సినిమా బ్రేక్ చేయలేకపోయింది.
Also Read: Viral News: 56 ఏళ్లుగా ఆమె కడుపులో ఉన్న పిండం.. చివరికి..?
ఈ చిత్రం కన్నడ, బెంగాలీ, మణిపురి, హిందీ, తమిళ్, పంజాబీ, బంగ్లాదేశ్, నేపాలి, ఒడియ భాషల్లో రీమేక్ జరిగింది. విచిత్రం ఏమిటంటే అన్ని భాషల్లో కూడా ఈ సినిమా అఖండ విజయాన్ని అందుకుంది. 2005లో ఈ సినిమా తెలుగులో రిలీజ్ అవ్వగా ఆ సంవత్సరం అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నువ్వొస్తానంటే నేనొద్దంటానా నిలిచింది. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే నంది అవార్డుల లిస్టులో కూడా ఈ సినిమా తన స్టామినాను చూపించింది. సినిమా పరంగా మొత్తం 5 కేటగిరీలలో నంది అవార్డులను కైవసం చేసుకుంది.