Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవల లైగర్ సినిమాతో భారీ పరాజయాన్ని అందుకున్న విజయ్.. పూరి జగన్నాథ్ దర్శకత్వంలోనే జనగణమణ తీస్తున్నాడు. మరోపక్క శివ నిర్వాణ దర్శకత్వంలో సామ్ తో కలిసి ఖుషి సినిమా చేస్తున్నాడు. ఇక ఈ షూటింగ్స్ కు కొద్దిగా గ్యాప్ ఇచ్చిన విజయ్ ఇటీవలే దుబాయ్ లో జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ చూడడానికి వెళ్లిన విషయం విదితమే. ఇక ఆ ఈవెంట్ లో ఒక బీభత్సమైన స్టేట్మెంట్ ఇవ్వడంతో ప్రస్తుతం అందరి చూపు విజయ్ పైనే ఉంది. అదేంటంటే. త్వరలోనే ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బయోపిక్ లో నటిస్తాను అని చెప్పుకొచ్చాడు విజయ్.
“ఇప్పటికే ధోని బయోపిక్ ను సుశాంత్ రాజ్ పుత్ తో తీసేశారు, నేను ఇప్పుడు విరాట్ కోహ్లీ బయోపిక్ లో నటించాలనుకుంటున్నా.. విరాట్ పాత్రను నేను తప్ప ఎవరు చేయలేరు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ వార్తపై నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. లైగర్ సినిమాకు కూడా ఇలాగే అన్నావ్.. ఏమైంది అని కొందరు. ఇలాంటి ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకొంటే మంచిదని మరికొందరు చెప్పుకొస్తున్నారు. విరాట్ బయోపిక్ రావడం ఖాయం.. కానీ అందులో విరాట్ గా ఎవరు నటిస్తారు అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ విజయే విరాట్ గా మారితే ఏ రేంజ్ లో ఉంటుందో అభిమానులు ఇప్పటినుంచే ఉహించుకొంటున్నారు.