Vijay Devarakonda హీరోయిన్ తో పార్టీలో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆ వీడియోను లీక్ చేసింది కూడా హీరోయిన్ కావడం విశేషం. నిన్నటితరం హీరోయిన్, నేటితరం నిర్మాత ఛార్మి ఈ వీడియోను సోషల్ మీడియాలో వదిలింది. అందులో విజయ్ దేవరకొండ, అనన్య పాండే పార్టీలో మునిగితేలుతున్నారు. విషయంలోకి వెళ్తే… ధర్మ ప్రొడక్షన్స్ సీఈఓ అపూర్వ మెహతా పుట్టినరోజు వేడుకలో “లైగర్” టీం మొత్తం పాల్గొంది. ఛార్మి విడుదల చేసిన ఈ వీడియోలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే తమ అద్భుతమైన లుక్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. విజయ్ విభిన్నమైన హెయిర్‌స్టైల్‌లో కన్పించగా, అనన్య బ్లాక్ కలర్ నెట్డ్ డ్రెస్‌లో అందంగా, హాట్ గా కన్పిస్తూ యువకుల హృదయాలను దోచుకుంది.ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియోలో తెగ వైరల్ అవుతున్నాయి.
Read Also : The Kashmir Files : డైరెక్టర్ కు వై కేటగిరీ భద్రత… అసలేం జరుగుతోంది ?
కాగా ‘లైగర్’ సినిమాలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ స్పోర్ట్స్ డ్రామాకు ఛార్మి కూడా ఒక నిర్మాతగా వ్యవహరిస్తోంది. కరణ్ జోహార్, పూరీ జగన్నాథ కలిస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాది ఆగష్టు 25న విడుదల కానుంది.