విద్యా బాలన్ మరో కొత్త సినిమా అనౌన్స్ చేసింది. ‘జల్సా’ పేరుతో ఆమె నెక్ట్స్ మూవీ చేయనుంది. గతంలో ‘తుమ్హారీ సులు’ లాంటి హిట్ అందించిన డైరెక్టర్ సురేశ్ త్రివేణీ రెండోసారి విద్యాతో కలసి పని చేయబోతున్నాడు.
తెలుగులో ‘జల్సా’ అనగానే మనకు పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ బ్లాక్ బస్టర్ మూవీనే గుర్తుకు వస్తుంది! అదే టైటిల్ ని ఎంచుకున్న విద్యా 2022లో జల్సా చేసేద్దాం అంటూ ప్రకటించింది. త్వరలోనే ఈ ఫీమేల్ సెంట్రిక్ ఎంటర్టైనర్ షూట్ మొదలు కానుందట. విద్యాతో పాటూ ‘జల్సా’లో షెఫాలీ షా కూడా కీలక పాత్ర పోషించనుంది. టీ-సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ నిర్మించనున్నాడు. ఆయనతో పాటూ విక్రమ్ మల్హోత్రా, సురేశ్ త్రివేణీ కూడా ప్రొడ్యూసర్స్ గా వ్యవహరిస్తారు.
విద్యా బాలన్ గత రెండు చిత్రాలు ‘శకుంతలా దేవి’ బయోపిక్ అండ్ ‘షేర్నీ’ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యాయి. రెండిటికీ మంచి పేరు వచ్చింది. పర్పామెన్స్ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ గా మారిన విద్యా బాలన్ ‘జల్సా’తో ఎలాంటి అనుభూతిని పంచుతుందో, చూడాలి మరి…