బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యా బాలన్ గురించి ప్రత్యేకంగా పరిచయం ఇవ్వాల్సిన అవసరం లేదు. అందం, అభినయం కలబోసిన రూపం.. స్టార్ హీరోయిన్లు కూడా చేయలేని పాత్రలను చేసి అందరిచేత శబాష్ అనిపించుకుంది విద్యా. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే అమ్మడు బాడీ షేమింగ్ ఎదుర్కొని, ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూనే ఉంది. కొన్నిసార్లు ట్రోలర్స్ కి గట్టిగా బుద్ది చెప్పి నెటిజన్ల ప్రసంశలు అందుకుంటుంది. అయితే ఇవన్నీ చాలా చిన్నవి అని తాను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడు ఇంతకంటే దారుణమైన అవమానాలను ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చింది.
తాజాగా విద్యా బాలన్ నటించిన జల్సా సినిమా ఓటిటీలో విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమోషన్స్ లో పాల్గొన్న ఆమె పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ” కెరీర్ మొదట్లో సినిమా ఆఫర్లు వచ్చినట్లే వచ్చి వెళ్లిపోయేవి. చాలా మంది నిర్మాతలు సినిమా ఆఫర్ ఇచ్చినట్టే ఇచ్చి తర్వాత నోటీసు కూడా ఇవ్వకుండానే తప్పించేవారు. అలా నేను అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఒక నిర్మాత నన్ను దారుణంగా అవమానించారు. ఆయన అన్న మాటలకు నేను ఆరునెలలు నా ముఖాన్ని అందంలో కూడా చూసుకోలేకపోయాను. ఆయన మాటలు అంతగా నా ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీశాయి. మూడేళ్లు ఎన్నో ప్రయత్నాలు.. ఎన్నో అవమానాలు అన్నింటిని తట్టుకొని నిలబడి ఇప్పుడు ఏ స్థానానికి వచ్చాను” అని చెప్పుకొచ్చింది. ఇక విద్యా బాలన్ .. తెలుగులో బాలకృష్ణ సరసన కథానాయకుడు లో కనిపించి మెప్పించింది.