Victory Venkatesh Interesting Comments On Nandi Awards: రెండు తెలుగు రాష్ట్రాల్లో కొంతకాలం నుంచి నంది అవార్డులపై తెగ చర్చలు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఈ అవార్డుల్ని.. 2016 వరకు ప్రతి ఏటా ఇచ్చారు కానీ, ఆ తర్వాతి నుంచి ఇవ్వట్లేదు. అప్పుడప్పుడు ఇచ్చారు కానీ, మునుపటిలా రెగ్యులర్‌గా పురస్కారాలు అందజేయట్లేదు. ఈ నేపథ్యంలోనే.. ఈ అవార్డుల వ్యవహారంపై మాటల యుద్ధమే జరుగుతోంది. ఒకప్పుడు ప్రభుత్వాలు ఇచ్చే ఈ అవార్డులకు విలువ ఉండేదని, ఇప్పుడు విలువే లేకుండా పోయిందని కొందరు ప్రముఖులు తమ అభిప్రాయాల్ని వ్యక్తపరిచారు. పురస్కారాల విషయంలో రాజకీయ జోక్యం కూడా ఎక్కువైందంటూ ఆమధ్య వ్యాఖ్యానాలు వినిపించాయి. ఓ ప్రముఖ నిర్మాత అయితే.. ఇప్పుడు సినిమాలకు అవార్డులు ఇచ్చే రోజులే లేవని బాంబ్ పేల్చారు.
Krishna Jackie Shroff : మండుతున్న ఎండల్లో.. ఇలాంటి ఫోజులు పెట్టి హీటెక్కిస్తున్న పాప
ఇలాంటి తరుణంలో.. విక్టరీ వెంకటేశ్ నంది అవార్డులపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. తేజ దర్శకత్వంలో దగ్గుబాటి అభిరామ్ కథానాయకుడిగా పరిచయం అవుతున్న ‘అహింస’ సినిమా ఈవెంట్‌లో వెంకటేశ్ నంది అవార్డులపై మాట్లాడుతూ.. తాను అవార్డుల గురించి ఎక్కువగా ఆలోచించనని అన్నారు. ప్రభుత్వం ఇస్తే ఇవ్వొచ్చు, లేదంటే లేదని చెప్పారు. కానీ.. అవార్డులు తనకు ఎంకరేజ్‌మెంట్‌ను అందిస్తాయని చివర్లో ట్విస్ట్ ఇచ్చారు. అంటే.. ప్రభుత్వాలు అవార్డులు ఇస్తే, ప్రోత్సాహకరంగా ఉంటుందన్న అభిప్రాయాన్ని వెంకటేశ్ పరోక్షంగా వెలిబుచ్చారు. ఇలాగే.. ఇతర స్టార్ హీరోలు ముందుకొచ్చి మాట్లాడితే, బహుశా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ముందుకు కదిలిరావొచ్చు. కాగా.. ఈ నంది పురస్కారాలను తెలంగాణ ప్రభుత్వం సింహ అవార్డులుగా మార్చి ఇస్తామని అప్పట్లో ప్రకటించింది.
Bihar: బీహార్లో దారుణం.. పోలీస్ ఇంట్లోనే వ్యభిచారం