Jr NTR: ప్లేటు తిప్పేసిన ఆ డైరెక్టర్.. తారక్ ఫ్యాన్స్ ఆశలు గల్లంతు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vetrimaaran Gives Shock To Jr NTR Fans: కొన్ని రోజుల క్రితం జూ. ఎన్టీఆర్‌పై ఓ రూమర్ తెగ చక్కర్లు కొట్టింది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్‌తో తారక్ జత కట్టబోతున్నాడన్నదే ఆ రూమర్ సారాంశం. ఇదొక మల్టీస్టారర్ సినిమా అని, ఇందులో ధనుష్ కూడా మరో కథానాయకుడి పాత్రలో నటించబోతున్నాడని ప్రచారం జరిగింది. ఓ వారం రోజుల పాటు ఈ ప్రచారం జరగడం, దీన్ని ఎవ్వరూ ఖండించకపోవడంతో.. తారక్ ఫ్యాన్స్ నిజమేనని అనుకున్నారు. ఇదో క్రేజీ కాంబినేషన్ అని, తప్పకుండా ఈ ప్రాజెక్ట్ సరికొత్త సంచలనాలకు తెరతీస్తుందని భావించారు. ఆల్రెడీ విలక్షన నటుడిగా తానేంటో నిరూపించుకున్న తారక్‌కి వెట్రిమారన్ లాంటి దర్శకుడు తోడైతే, ఇక విశ్వరూపం చూపించడం ఖాయమని ఫిక్స్ అయ్యారు. కానీ.. ఇంతలోనే వెట్రిమారన్ ఓ బాంబ్ పేల్చాడు. ఈ ప్రాజెక్టే లేదని పరోక్షంగా స్పష్టం చేశాడు.
Vidya Balan: ఆ డైరెక్టర్‌తో రూమ్‌లోకి వెళ్లా.. డోర్ లాక్ చేయకుండానే..
Also Read
- Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'ఆమె' కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
తన లేటెస్ట్ సినిమా ‘విదుతలై’ ఆడియో ఈవెంట్లో వెట్రిమారన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం తన దృష్టంతా ఈ విదుతలైని పూర్తి చేయడంలోనే ఉందన్నాడు. ఇది రెండు భాగాల్లో రూపొందుతున్న సినిమా. ఇప్పుడు పార్ట్ 1 విడుదల చేస్తున్నారు. దీని తర్వాత పార్ట్ 2 చిత్రీకరణను ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్ట్ తర్వాత తాను సూర్యతో కలిసి వాడివాసల్ సినిమా చేయబోతున్నానని స్పష్టం చేశాడు. అంతేకాదు.. సూర్యతో ప్రాజెక్ట్ ముగిశాక, ధనుష్‌తో వడా చెన్నై 2 సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నట్టు క్లారిటీ ఇచ్చాడు. ఇలా తన ప్రసంగంలో ఈ మూడు ప్రాజెక్టుల గురించే మాట్లాడాడే తప్ప.. తెలుగు హీరోతో జతకడుతున్నట్టు ఒక్క హింట్ కూడా ఇవ్వలేదు. దీంతో.. ఎన్టీఆర్, వెట్రిమారన్ కాంబో లేనట్టేనని అర్థమవుతోంది. మరి.. భవిష్యత్తులోనైనా వీరి కలయికలో ఓ ప్రాజెక్ట్ ఉంటుందో? లేదో? చూడాలి.
Menstrual Blood : రక్తం ఖరీదు రూ.50వేలు.. కోడలిది తీసి మంత్రగాడికి అమ్మిన అత్త
తాజావార్తలు
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
-
Tilak Varma Run Out: తిలక్ వర్మ నిర్లక్ష్యం.. ఊహించని రీతిలో రనౌట్.. అసలేం జరిగిందంటే?
ట్రెండింగ్
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..