Vidya Balan: ఆ డైరెక్టర్‌తో రూమ్‌లోకి వెళ్లా.. డోర్ లాక్ చేయకుండానే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vidya Balan Talks About Her Casting Couch Experience: సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ వ్యవహారం ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ.. ‘మీటూ ఉద్యమం’ తర్వాతి నుంచే ఆ చీకటి బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఆ ఉద్యమం సమయంలో ఎందరో భామలు చిత్రసీమలో తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి చెప్పుకుంటూ వచ్చారు. ఈ క్రమంలోనే స్టార్ నటీమణులు కూడా ఓపెన్ అయ్యారు. కెరీర్ ప్రారంభంలో తాము ఎదుర్కొన్న ఈ కాస్టింగ్ కౌచ్ అనుభవాల్ని పంచుకున్నారు. ఇప్పుడు లేటెస్ట్‌గా విద్యాబాలన్ కూడా.. కాస్టింగ్ కౌచ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. ఒక దర్శకుడు తనని కాఫీకి పిలిచి, రూమ్‌కి రమ్మన్నాడని కుండబద్దలు కొట్టింది. అతని పిలుపుతో తాను రూమ్‌కి వెళ్లానని, అయితే చాకచక్యంగా వ్యవహరించడంతో ఆ డైరెక్టర్ మౌనంగా వెళ్లిపోయాడని తెలిపింది.
Ravichandran Ashwin: చరిత్ర సృష్టించిన అశ్విన్.. ఆ ఘనత సాధించిన తొలి భారత బౌలర్
Also Read
- Sushmita Konidela: విజయవాడ దుర్గమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్ గా మెగాస్టార్ చిరంజీవి కుమార్తె
- Epic: ‘కడలి’ ప్రతి అమ్మాయిలోనూ ఉంటుంది.. ఫ్యామిలీ ఆడియన్స్ ని 'ఎపిక్' మెప్పిస్తుంది : వైష్ణవి చైతన్య
- Anaswara Rajan: చిరంజీవి కూతురిగా అనస్వర రాజన్.. 'అమ్ములు' ఫస్ట్‌లుక్ వచ్చేసింది!
- Citizen Vigilante: హింసకు భయపడి జర్మనీ ఆపేసిన సినిమా.. ఎలాన్ మస్క్ ఎంట్రీతో ఒక్కసారిగా..!
విద్యాబాలన్ మాట్లాడుతూ.. ‘‘దక్షిణాది సినీ పరిశ్రమలో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్న రోజులవి. ఆ సమయంలో ఓ యాడ్ ఫిల్మ్ కోసం డైరెక్టర్‌ను కలిసేందుకు చెన్నై వెళ్లా. అక్కడ కాఫీ షాప్‌లో మాట్లాడుకుందామని నేను చెప్పాను. అయితే.. ఆ దర్శకుడు నన్ను రూమ్‌కి వెళ్లి, మాట్లాడుకుందామని చెప్పాడు. అప్పుడే అతని ఉద్దేశం ఏంటో నాకు అర్థమైంది. దీంతో.. గదిలోకి వెళ్లిన తర్వాత నేను డోర్ లాక్ చేయకుండా, కొంచెం తెరిచి ఉంచాను. అది గమనించిన ఆ దర్శకుడు.. ఏమీ మాట్లాడకుండా ఐదు నిమిషాల తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ టైంలో నేను తెలివి ప్రదర్శించడం వల్లే తప్పించుకోగలిగాను. ఇప్పటికీ నేను ఆ సంఘటనని మర్చిపోలేకపోతున్నా. ఇదొక్కటే కాదు.. ఇలాంటి సంగఘనలు ఎన్నో ఎదుర్కొన్నా. వాటి వల్ల మానసికంగా ఇబ్బందులు పడ్డాను. ఆ మానసిక ఒత్తిడి నుంచి బయటపడేందుకు చాలాకాలం కష్టపడాల్సి వచ్చింది’’ అంటూ చెప్పుకొచ్చింది.
Diplomatic Ties: ఇరాన్, సౌదీ అరేబియా దౌత్య సంబంధాలు.. చైనా మధ్యవర్తిత్వంతో ఒప్పందం
అయితే.. తాను సహకరించకపోవడం వల్ల ఆ దర్శకుడు తనని ఆ యాడ్ ఫిల్మ్ నుంచి తొలగించాడని విద్యాబాలన్ పేర్కొంది. అంతేకాదు.. బాడీ షేమింగ్ కూడా చేశారని వాపోయింది. దాంతో తాను చాలా బాధపడ్డానని, తిరిగి కోలుకోవడం కోసం కొంత సమయం పట్టిందని తెలిపింది. తాను ట్యాలెంట్‌ని నమ్ముకొని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టానని, ఆ ప్రతిభతోనే ఈరోజు ఈ స్థాయికి చేరుకోగలిగానని వెల్లడించింది. కాగా.. 2005లో ‘పరిణీత’ సినిమాతో ఈ భామ బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందడం కోసం కొన్ని సంవత్సరాలు కష్టపడింది. చివరికి.. 2011లో ఆమె కష్టానికి ఫలితం దక్కింది. ఆ సంవత్సరంలో తాను చేసిన ‘డర్టీ పిక్చర్’ సినిమా.. విద్యాబాలన్‌కి ఎనలేని పాపులారిటీ తెచ్చిపెట్టింది.
తాజావార్తలు
-
Ashwini Vaishnaw: 320 కిమీ వేగం.. 12 స్టేషన్లు.. 508 కి.మీ కారిడార్.. బుల్లెట్ రైలుపై కేంద్ర మంత్రి కీలక అప్డేట్..
-
Are Shyamala: కులాలు, మతాలు మార్చేశారా?.. డీఎస్సీపై ఆరె శ్యామల సంచలన వ్యాఖ్యలు
-
KL Rahul-IPL 2027: ట్రేడ్ రూమర్స్‌కు చెక్.. ఢిల్లీ క్యాపిటల్స్‌తోనే కేఎల్ రాహుల్!
-
Sushmita Konidela: విజయవాడ దుర్గమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్ గా మెగాస్టార్ చిరంజీవి కుమార్తె
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
ట్రెండింగ్
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!
-
Elon Musk: ఇక 5 – 10 ఏళ్లే ఈ ఉద్యోగాలు.. ఆపై అంతా రోబోల ప్రపంచమే..!
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!