Venky Anil5: ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్.. క్రేజీ వీడియో రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!

Venky Anil5

Venky Anil5

Venky Anil5: విక్టరీ వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వెంకీ అనిల్5’. ప్రస్తుతం ఈ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. తాజాగా ఈ సినిమా తొలి షెడ్యూల్‌ను చిత్ర బృందం సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసిందని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ‘‘స్వింగ్ చేస్తూ.. బ్లాక్‌బస్టర్ స్టైల్‌లో మొదటి షెడ్యూల్‌ను ముగించాం’’ అంటూ చిత్ర బృందం ప్రత్యేక వీడియోను షేర్ చేసింది. ఈ షెడ్యూల్‌లో ప్రేక్షకులను అలరించే వినోదభరితమైన సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలిపింది. ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో కూడిన సన్నివేశాలను అద్భుతంగా తెరకెక్కించినట్లు వెల్లడించింది.

వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌కు టాలీవుడ్‌లో ప్రత్యేక క్రేజ్ ఉంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను మెప్పించాయి. దీంతో ఇప్పుడు వస్తున్న ‘వెంకీ అనిల్5’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో నందమూరి కళ్యాణ్ రామ్ మరో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో వెంకటేశ్ సరసన కీర్తి సురేశ్, కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్‌పై నిర్మాత సాహు గారపాటి ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు ‘సురేష్ ప్రొడక్షన్స్’, ‘జీ స్టూడియోస్’ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.