Venky Anil5: ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్.. క్రేజీ వీడియో రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Venky Anil5: విక్టరీ వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వెంకీ అనిల్5’. ప్రస్తుతం ఈ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. తాజాగా ఈ సినిమా తొలి షెడ్యూల్‌ను చిత్ర బృందం సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసిందని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ‘‘స్వింగ్ చేస్తూ.. బ్లాక్‌బస్టర్ స్టైల్లో మొదటి షెడ్యూల్‌ను ముగించాం’’ అంటూ చిత్ర బృందం ప్రత్యేక వీడియోను షేర్ చేసింది. ఈ షెడ్యూల్లో ప్రేక్షకులను అలరించే వినోదభరితమైన సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలిపింది. ఫన్, ఎంటర్టైన్మెంట్తో కూడిన సన్నివేశాలను అద్భుతంగా తెరకెక్కించినట్లు వెల్లడించింది.
వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌కు టాలీవుడ్లో ప్రత్యేక క్రేజ్ ఉంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను మెప్పించాయి. దీంతో ఇప్పుడు వస్తున్న ‘వెంకీ అనిల్5’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో నందమూరి కళ్యాణ్ రామ్ మరో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో వెంకటేశ్ సరసన కీర్తి సురేశ్, కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్‌పై నిర్మాత సాహు గారపాటి ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు ‘సురేష్ ప్రొడక్షన్స్’, ‘జీ స్టూడియోస్’ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
Also Read
- Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
- Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
- Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
Swinging left to right…
and signing off the first schedule in blockbuster style ❤️🔥Team #VenkyANIL5 – #NKRAR2 has successfully wrapped up an exciting first schedule, canning some absolute fun-filled and entertaining sequences🤩💥
SANKRANTHI 2027 RELEASE😎🔥 pic.twitter.com/Xdi86QapDm
— Suresh Productions (@SureshProdns) July 23, 2026
తాజావార్తలు
-
Sushila Devi Inspirational Story: 63 ఏళ్ల వయసులో పదో తరగతి పాసైన బామ్మ.. 79.6 శాతం మార్కులతో అదరగొట్టిందిగా..
-
Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Jantar Mantar Protest: తీహార్ జైలుకు సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా..
-
Afg Vs Ban: టెస్ట్ క్రికెట్లోనే ఆఫ్ఘనిస్థాన్ అద్భుత పోరాటం.. ఏకంగా 142 ఓవర్లు ఆడి మ్యాచ్ డ్రా..
-
Abhishek Porel: 36 రోజుల జైలు జీవితం.. బెయిల్‌పై బయటకు వచ్చి సెంచరీ.. గ్రౌండ్లో బోరున ఏడ్చేసిన అభిషేక్..
ట్రెండింగ్
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!