Venkatesh: విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాకు వెంకీ మామ చాలా దూరంగా ఉంటాడు. ఇక ఆయన పిల్లలు ఇప్పటివరకు ఏం చేస్తున్నారు అన్న విషయం కూడా చాలామందికి తెలియదు. తన కుటుంబాన్ని ఎన్నడూ బయట మీడియా ముందు చూపించింది లేదు. వెంకీ మామ రెండో కూతురు వివాహం ఈ మధ్యనే ఘనంగా జరిగిన విషయం తెల్సిందే. హీరో వెంకటేష్ – నీరజల రెండో కుమార్తె హయవాహిని వివాహం విజయవాడకు చెందిన డాక్టర్ నిశాంత్ పాతూరితో రామానాయుడు స్టూడియోస్ లో జరిగింది. ఈ పెళ్ళికి సినీ ఇండస్ట్రీ నుంచి స్టార్స్ కూడా విచ్చేసారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారిన విషయం తెల్సిందే.
ఇక పెళ్లి తరువాత నూతన దంపతులు తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు. నేడు విఐపీ విరామ సమయంలో హయవాహిని, నిశాంత్ స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపించి, ఆశీస్సులు అందుకున్నారు. ఇక కొత్త పెళ్లి కూతురు హయవాహిని ఎంతో సింపుల్ గా కనిపించింది. ఒక స్టార్ హీరో కూతురులా అస్సలు కనిపించలేదు. అస్సలు ఆమె ఎవరో కూడా అక్కడ చాలామందికి తెలియదు అన్నట్లే ఉన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక వెంకటేష్ సినిమాల విషయానికొస్తే.. రానా నాయుడు సీజన్ 2 సెట్స్ మీద ఉంది. ఇది కాకుండా అనిల్ రావిపూడి తో ఒక సినిమా చేస్తున్నట్లు టాక్.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో వెంకటేష్ కూతురు, అల్లుడు.
వెంకటేష్ దగ్గుబాటి రెండో కుమార్తె హవ్య వాహినికి విజయవాడకు చెందిన డాక్టర్ నిశాంత్ పాతూరితో ఈ మధ్యనే వివాహం జరిగింది. #Venkatesh #Tollywood #Tirumala #Tirupathi pic.twitter.com/CQBAdyLEo5— Telugu360 (@Telugu360) March 25, 2024