Venkaiah Naidu Comments on Shanthala Movie: శాంతల చిత్రానికి నేషనల్ అవార్డు రావాలని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. నవంబర్ 24న విడుదల కానున్న శాంతల సినిమాను వీక్షించిన వెంకయ్య నాయుడు సినిమా అద్భుతంగా ఉంది అని కొనియాడారు. వెంకయ్య నాయుడు మాట్లాడుతూ “శాంతల చలనచిత్ర ప్రివ్యూ ని శుక్రవారం వీక్షించా, అద్భుతమైన కళాత్మక చిత్రం ఇది. నాట్య కళ, మహిళా సాధికారికత ఇతివృత్తంగా చారిత్రక నేపథ్యం లో నిర్మించిన శాంతల చూస్తున్నప్పుడు నాకు కన్నీళ్లు ఆగలేదు, భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయాను. కొత్త నటీనటులైనప్పటికీ అద్భుతంగా నటించారు, కుటుంబ సమేతంగా చూడదగిన సినిమా ఇది.
Tollywood: తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం.. చంద్రమోహన్ మృతి మరువక ముందే నిర్మాత మృతి!
ఈ సినిమా జాతీయ అవార్డులు సాధించగలదని ఆశిస్తున్నా, ఇంత మంచి సినిమాని అందించినందుకు దర్శకుడు శేషును అభినందిస్తున్నా, శేషు ఇంతకు మునుపు అక్కినేని ఫ్యామిలీతో పని చేశారు, దర్శకుడిగా ఇది తన మొదటి చిత్రం అన్నారు. ఇక ఇండో అమెరికన్ ఆర్ట్స్ పతాకంపై కె ఎస్ రామారావు సమర్పణలో అమెజాన్ ప్రైమ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఫ్యామిలీ మాన్ ఫేమ్ అశ్లేష ఠాకూర్ ప్రధాన పాత్రలో నీహల్ హీరోగా త్రివిక్రమ్ శేషు దర్శకత్వంలో డాక్టర్ ఇర్రింకి సురేష్ నిర్మించిన పీరియాడిక్ మూవీ శాంతల. ఇక ఈ సినిమా నవంబర్ 24 న తెలుగు, హిందీ, కన్నడ, తమిళం, మరాఠీ మరియు మలయాళం భాషల్లో విడుదల కానుంది. ఇక శాంతల చిత్రం నిర్మాణపరంగా, సాంకేతికంగా ఎంతో ఉన్నతంగా ఉందని, కెమెరా పనితనం,నేపథ్య సంగీతం, నృత్యాలు, కూర్పు అద్భుతంగా ఉన్నాయని ఇంతటి మంచి అభిరుచితో సినిమా నిర్మించిన మేకర్స్ కి తన అభినందనలు తెలిపారు ఆయన.