Telugu Producer Yakkali ravindra Babu passed away: తెలుగు సినీ పరిశ్రమలో మరో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నిజానికి ఈ ఉదయం హీరో, నటుడు చంద్రమోహన్ అనారోగ్యం బారిన పడి మృతు వాత పడడంతో ఒక పక్క సినీ పరిశ్రమ అంతా విషాదంలో కూరుకుపోయింది. ఇక ఇప్పుడు మరో నిర్మాత కూడా కన్నుమూశాడు. శ్రావ్య ఫిలిమ్స్ వ్యవస్థాపక నిర్మాతగా మిత్రులతో సొంత ఊరు , గంగపుత్రులు లాంటి అవార్డు చిత్రాలతో పాటు ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, రొమాంటిక్ క్రిమినల్స్, గల్ఫ్, వలస లాంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించిన అభిరుచి గల నిర్మాత యక్కలి రవీంద్ర బాబు హైదరాబాద్ లో ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నేడు మధ్యాహ్నం తుది శ్వాస విడిచారని సమాచారం. ఆయన వయసు 55 సంవత్సరాలు.
Bigg Boss Telugu 7: ఈసారి ఎలిమినేషన్ కూడా ఉల్టా ఫుల్టానే.. ఆమె కాదు!
ఆంధ్ర ప్రదేశ్ లోని ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మార్కాపురం లో పుట్టి మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని ఛార్టర్డ్ ఇంజనీర్ గా తన సేవలు అందిస్తూనే తనకి సినిమా పట్ల ఉన్న ఇష్టంతో నిర్మాతగా మారి దాదాపు 17 చిత్రాలు నిర్మించి పలు అవార్డులు పొందారు యక్కలి రవీంద్ర బాబు. ఇక తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళ బాషాలలో కూడా చిత్రాలు నిర్మించారు యక్కలి రవీంద్ర బాబు. యక్కలి రవీంద్ర బాబుకి భార్య రమాదేవి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన అంత్యక్రియల వివరాలు కుటుంబ సభ్యులు వెల్లడించలేదు. ఇక మరోపక్క చంద్రమోహన్ అంత్యక్రియలు సోమవారం నాడు జరుపనుననట్టు అధికారిక ప్రకటన వచ్చింది.