VeeraSimhaReddy: ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో చిన్న సినిమాలు అయినా, పెద్ద సినిమాలు అయినా రెండు వారాలు ఆడితే గొప్ప విషయం.. రెండు నెలలు ఆడితే ఇంకా గొప్ప విషయం. ఇంక 100 రోజులు ఆడితే.. ఏ అలాంటివి ఇప్పుడు జరగవులే అని కొట్టిపడేస్తారు. అయితే ఆ రికార్డ్ ను కొట్టేశాడు నందమూరి బాలకృష్ణ. ఆయన నటించిన వీరసింహారెడ్డి.. 100 రోజులు థియేటర్ లో కంటిన్యూగా రన్ అయ్యింది. వంద రోజులు థియేటర్ల వద్ద సందిడి చేసిన ఈ చిత్రం బాక్సాఫీసును షేక్ చేసింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. ఈ చిత్రంలో బాలయ్య సరసన శృతి హాసన్, హనీ రోజ్ నటించారు.
Indraja: కీర్తి సురేష్ డ్యాన్స్ తో ఇచ్చిపడేసిన ఇంద్రజ.. ఈ వయస్సులో కూడా
ఇక సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి.. అన్ని సినిమాలను వేగాన్ని నెట్టి సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాలయ్య కెరీర్ లోనే అత్యధిక కలక్షన్స్ రాబట్టి ఇండస్ట్రీని షేక్ చేసింది. ఇక ఈ సినిమా వంద రోజుల రన్ పూర్తి చేసుకున్న సందర్భంగా సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు అభిమానులు. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. సింగిల్ హ్యాండ్ తో సెంచరీ అంటూ బాలయ్య కారు దిగుతున్న పోస్టర్ పై 100 డేస్.. వాటి మధ్యలో గోపీచంద్ మలినేని, నిర్మాతల ఫోటోలను వేసిన ఈ పోస్టర్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ హిందూపురంలో బాసన్నపల్లిలోని ఓల్డ్ షుగర్ ఫ్యాక్టరీలో ఏప్రిల్ 23 న జరగనున్నాయి. మరి ఈ ఈవెంట్ కు బాలయ్య వస్తాడా..? రాడా..? అనేది తెలియాల్సి ఉంది.