Veera Simha Reddy: అఖండ తరువాత నందమూరి బాలకృష్ణ నటిస్తున్న చిత్రం వీరసింహారెడ్డి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ నటిస్తోంది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం జనవరి 12 న రిలీజ్ అవుతోంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్ల వేగాన్ని షురూ చేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముహూర్తం ఖరారు చేశారు. జనవరి 6 న ఒంగోలులో ఈ ఈవెంట్ ను నిర్వహిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.
ఒంగోలు నేపథ్యంలోనే ఈ చిత్రం తెరకెక్కినట్లు తెలుస్తోంది. దీంతో అక్కడే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహిస్తే బావుంటుందని మేకర్స్ భావించి అక్కడ ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఇక ఇప్పటి నుంచే ఒంగోలులో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక వీరసింహారెడ్డి మీద అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. బాలయ్యతో పాటే పోటీ పడడానికి వాల్తేరు వీరయ్య రెడీ గా ఉన్నాడు. మరి ఈ సంక్రాంతికి ఈ ఇద్దరు హీరోలు ఎలాంటి హిట్ ను అందుకుంటారో చూడాలి.