‘వీర సింహా రెడ్డి’ సినిమాలోని ఒక సాంగ్ ని చిత్ర యూనిట్ షూట్ చేస్తున్నారు. హీరోయిన్ శృతి హాసన్, బాలకృష్ణల పైన ఈ సాంగ్ ని రూపొందిస్తున్నారు. ఇటివలే పవన్ కళ్యాణ్, క్రిష్ లు బాలయ్యని కలిసింది కూడా ఈ సెట్స్ నుంచే. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఖొరియోగ్రఫి చేస్తున్న ఈ సాంగ్ సెట్స్ లోనే ‘క్రిస్మస్’ పండుగని సెలబ్రేట్ చేసుకున్నారు చిత్ర యూనిట్. కేక్ కట్ చేసిన బాలకృష్ణ, ప్రేక్షకులకి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపాడు. ఇదిలా ఉంటే నందమూరి బాలకృష్ణ పేరు గత 48 గంటలుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. ‘వీర సింహా రెడ్డి’ సినిమా నుంచి ‘మా బావ మనోభావాలు’ సాంగ్ బయటకి రావడమే ఇందుకు కారణం. ఒక పర్ఫెక్ట్ ఐటెం సాంగ్ ని ఇచ్చిన తమన్, నందమూరి అభిమానుల్లో జోష్ తెచ్చాడు. ‘మా బావ మనోభావాలు’ సాంగ్ చార్ట్ బస్టర్ అయ్యింది. రిలీజ్ అయిన ఒక్క రోజులోనే ‘మా బావ మనోభావాలు’ సాంగ్ 5.5 మిలియన్ వ్యూస్, 125k లైక్స్ ని రాబట్టి మాస్ ని మెప్పిస్తోంది.
Read Also: Nandamuri Balakrishna: బాలయ్య.. మజాకానా.. ప్రభాస్ తో కూడా ఆ పని చేయించేశాడు..

Veera Simha Reddy Chrsitams
‘మా బావ మనోభావాలు’ లిరికల్ సాంగ్ లో బాలయ్య చేసిన డాన్స్ మూమెంట్స్ ని అక్కడక్కడా చూపించారు. ఆ క్లిప్పింగ్స్ లో బాలయ్య వేసిన స్టెప్స్ సూపర్బ్ గా ఉన్నాయి. జస్ట్ లిరికల్ సాంగ్ తోనే ఈ రేంజ్ కిక్ ఇస్తే, థియేటర్స్ లో ఫుల్ సాంగ్ చూస్తే నందమూరి అభిమానులు విజిల్స్ వేసి థియేటర్ టాపు లేపినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. వీర సింహా రెడ్డి సినిమా నుంచి ఇప్పటికే మూడు సాంగ్స్ బయటకి వచ్చి మూడు మంచి ఆదరణ పొందాయి. మిగిలిన పాటలని జనవరి 6న ఒంగోల్ లో జరగనున్న ప్రీరిలీజ్ ఈవెంట్ లోపు రిలీజ్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ పర్మిషన్ కోసం ప్రయత్నిస్తున్నారు. ప్రీరిలీజ్ వేదికపై బాలయ్యతో డైలాగ్స్ చెప్పిస్తానని గోపీచంద్, నందమూరి అభిమానులకి మాటిచ్చాడు. ఆ మాటని దర్శకుడు ఎంతవరకు నిలబెట్టుకుంటాడో చూడాలి.
Jingle bells jingle bells jingle all the way ❤️
Christmas celebrations from the sets of #VeeraSimhaReddy 💥
Merry Christmas 💫
Natasimham #NandamuriBalakrishna @megopichand @shrutihaasan @varusarath5 @MusicThaman @ramjowrites @RishiPunjabi5 @SonyMusicSouth pic.twitter.com/eHuTiEVhTJ
— Mythri Movie Makers (@MythriOfficial) December 25, 2022
Read Also: Chalapathi Rao: చలపతిరావు మరణం కలచివేసిందన్న చిరంజీవి, బాలకృష్ణ