Mega156: గతేడాది భోళా శంకర్ సినిమాతో భారీ పరాజయాన్ని అందుకున్నాడు చిరంజీవి. ఇక ఆ పరాజయం నుంచి బయటపడడానికి ఈసారి పక్కా ప్లాన్ వేశాడు. బింబిసార లాంటి హిట్ అందుకున్నడైరెక్టర్ వశిష్ఠ తో మెగా 156 ను మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఈ కాంబో అనుకున్నారో అప్పటినుంచి కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మొట్టమొదటిసారి యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో చిరు నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా పేరు విశ్వంభర అని టాక్ నడుస్తోంది. ముల్లోకాలు చుట్టే వీరుడుగా చిరు ఇందులో కనిపించనున్నాడట. రేపు ఈ సినిమా టైటిల్ ను మేకర్స్ రివీల్ చేయనున్నారు. ఇకపోతే వశిష్ఠ.. ఈ సినిమాపై చాలా కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వశిష్ఠ.. సినిమాపై అంచనాలను పెంచేశాడు.
“మెగా 156 సినిమా.. చిరు కెరీర్ లో టాప్ 10 సినిమాలు లిస్ట్ తీస్తే.. టాప్ 3 లో ఉండేలని కోరుకుంటున్నాను. ఇప్పటికీ జగదేక వీరుడు అతిలోక సుందరి అని ఎలా చెప్పుకుంటున్నామో ఈ సినిమా తరువాత దీని గురించి అలాగే చెప్పుకుంటారు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. సాధారణంగా ప్రతి డైరెక్టర్ కు తన కథపై ఎంతో నమ్మకం ఉంటుంది. ఒక డైరెక్టర్ ఈ రేంజ్ లో చెప్పడం కూడా చూసాం..కానీ, చిరు కెరీర్ లోనే టాప్ 3 సినిమాగా అంటే.. ఆయన చేసిన సినిమాల్లో ఎంత కాదనుకున్నా ఒక 10 సినిమాలను రీప్లేస్ కూడా చేయలేము. అలాంటిది టాప్ 3 సినిమాగా ఉండాలని కోరుకుంటున్నా అంటే.. ఇది కొంచెం ఓవర్ భయ్యా అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఈ మాటలతో సినిమాపై హైప్ వేరే లెవెల్ కు మారిపోయింది. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.