Nani: సోషల్ మీడియాలో ఏం నడుస్తోంది..అని ఎవరైనా అడిగితే.. టక్కున ఐరనే వంచాలా ఏంటీ.. అని చెప్పుకొస్తున్నారు. అంతలా ఫేమస్ అయ్యింది ఆ డైలాగ్. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఫ్యామిలీ స్టార్. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి ఇటీవలే టైటిల్ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో విజయ్ విలన్స్ కు వార్నింగ్ ఇస్తూ.. ఐరనే వంచాలా ఏంటీ.. అనే డైలాగ్ చెప్తాడు. ఇక అది ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ డైలాగ్ ఇంపాక్ట్ ఎక్కడివర్కౌ వెళ్లిందంటే.. హీరోలు సైతం ఈ డైలాగ్ .. తమ వెర్షన్ లో చెప్పుకొస్తున్నారు. తాజాగా నాని.. ఈ డైలాగ్ ను తన స్టైల్లో చెప్పి షాక్ ఇచ్చాడు. ప్రస్తుతం నాని హీరోగా శౌర్యవ్ దర్శకత్వంలో తెరకెక్కినచిత్రం హయ్ నాన్న. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమా డిసెంబర్ 7 న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్ర బృందం.. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నారు.
Keeda Cola : కీడా కోలా ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే..?
ఇక ఇందులో భాగంగా ఒక కాలేజ్ ను విజిట్ చేసిన నాని, మృణాల్ స్టూడెంట్స్ అడిగిన ప్రశ్నలకు తమదైన రీతిలో సమాధానాలు చెప్పారు. కమర్షియల్ సినిమాలు కాకుండా.. లవ్ స్టోరీస్, డిఫరెంట్ సినిమాలు తీస్తూ ఇంత ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నారు. ఇది ఎలా సాధ్యం అన్న ప్రశ్నకు.. నాని ఫ్యామిలీ స్టార్ డైలాగ్ తో సమాధానం చెప్పుకొచ్చాడు. “బ్లాక్ బస్టర్ లు కొట్టాలంటే యాక్షన్ సినిమాలే చెయ్యాలా ఏంటి? మసాలా ఫిలిమ్స్ ఏ చెయ్యాలా ఏంటి..” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.