మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా “గని”. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాయి మంజ్రేకర్ వరుణ్ ప్రేమికురాలిగా నటిస్తుండగా, కన్నడ స్టార్ ఉపేంద్ర, సీనియర్ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఘనీకి నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించగా అల్లు వెంకటేష్, సిద్ధు ముద్దా నిర్మించారు. థమన్ సంగీత స్వరకర్త. డిసెంబర్ 24న సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లలో వేగం పెంచేశారు. ఇప్పటికే విడుదలైన అప్డేట్స్ సినిమాపై హైప్ పెంచేయగా, తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ యాక్షన్ ప్యాక్డ్ టీజర్ మెగా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
Read Also : రియల్ చినతల్లికి సూర్య సూపర్ హెల్ప్… అసలైన ‘జై భీమ్’పై ప్రశంసలు
ఈ యాక్షన్ ప్యాక్డ్ టీజర్ మెగా అభిమానుల్లో సినిమాపై అమాంతం అంచనాలను పెంచేసింది. రామ్ చరణ్ వాయిస్ తో స్టార్ట్ అయిన ఈ వీడియోలో యాక్షన్ ఫీస్ట్ సన్నివేశాలు, అదిరిపోయే డైలాగులు ఉన్నాయి. “కోరికలు ఉంటాయి. కోపాలు ఉంటాయి. కనబడితే గొడవలు ఉంటాయి. ఇక్కడున్న ప్రతి ఒక్కడికీ ఛాంపియన్ కావాలన్న కోరిక ఉంటుంది. కానీ విజేతగా నిలిచేది ఒక్కడే… ఆ ఒక్కడివి నువ్వే ఎందుకు అవ్వాలి. వై యూ? ఆట ఆడినా ఓడినా రికార్డ్స్ లో ఉంటావు.. కానీ గెలిస్తే మాత్రమే చరిత్రలో ఉంటావు” అంటూ రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో వచ్చిన డైలాగులు సినిమాపై బజ్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి. టీజర్ లోని థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ స్పెషల్ హైలెట్.