Varun Tej and Lavanya wedding venue: త్వరలోనే మెగా కుటుంబంలో పెళ్లి భాజాలు మోగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంగేజ్‌మెంట్ చేసుకున్న వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ఈ ఏడాదిలోనే వివాహ బంధంతో ఒక్కటి అయ్యేందుకు అంతా సిద్ధం అవుతోంది. ఇప్పటికే నాగబాబు ఫ్యామిలీ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నట్లు చెబుతున్నారు. వరుణ్- లావణ్య పెళ్లి వేడుక ఇటలీలోని టుస్కానీ నగరంలో జరగనున్నట్లు ఉపాసన తన సోషల్ మీడియాలో లీక్ ఇచ్చింది. వీరి పెళ్లి తేదీపై ఇంకా ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఈ నెలలో జరుగుతుందా లేదా వచ్చేనెలలోనా అనే విషయంపై క్లారిటీ లేదు. నిజానికి వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇటలీలోని టుస్కానీలోని బోర్గో శాన్ ఫెలిస్ రిసార్ట్‌లో వీరు ఇరువురూ వివాహం చేసుకోనున్నారని అంటున్నారు.
Vijay Devarakonda: లైగర్ రిజల్ట్ చూశాక కూడా మరోసారి రిస్క్ చేస్తున్నాడంటే.. ఏం గుండెరా అది..?
ఈ లగ్జరీ రిసార్ట్ నిజానికి ఒక చారిత్రాత్మక గ్రామం కాగా దీనిని రిసార్ట్‌గా మార్చారని అంటున్నారు. “ఒక పియాజ్జా, ఒక ప్రార్థనా మందిరం, ఒకప్పుడు పాఠశాల, బేకరీ అలాగే ఆలివ్ ప్రెస్‌లకు వంకరగా తిరిగే దారులు, మీరు మా గ్రామ చరిత్రను అనుభూతి చెందవచ్చు” అని రిసార్ట్ తన వెబ్‌సైట్‌లో మెన్షన్ చేసింది. విలేజ్ రిసార్ట్‌లోని విలాసవంతమైన విల్లాల్లో అతిథులకు బస ఏర్పాటు చేస్తారని అంటున్నారు. ఇక వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి నవంబర్ 1 న వివాహం చేసుకోనున్నారని అంటున్నారు. నాలుగు రోజుల పాటు వివాహ వేడుకలు జరగనున్నాయని అతిథులందరూ నాలుగు రోజులు అక్కడ ఉంటారని అంటున్నారు. అక్టోబర్ 30న వరుణ్, లావణ్య కుటుంబ సభ్యులు, బంధువులు ఇటలీకి వెళ్లనున్నారు. ఈ వివాహానికి మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ సహా మెగా ఫ్యామిలీ అంతా హాజరుకానున్నారు.