Varun Tej: లావణ్యతో సీక్రెట్ లవ్ స్టోరీ.. ఎట్టకేలకు బయటపెట్టిన మెగా ప్రిన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం గాండీవధారి అర్జున అనే సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో వరుణ్ ప్రమోషన్ మొదలుపెట్టాడు. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటున్నాడు. ఇక ఈ ఏడాది ఈ కుర్ర హీరో.. ఎంగేజ్ మెంట్ చేసుకున్న విషయం తెల్సిందే. హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ప్రేమించి.. ఇరు కుటుంబాలను ఒప్పించి నిశ్చితార్థం చేసుకున్న వరుణ్ .. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. నిశ్చితార్థం అయ్యేవరకు కూడా వరుణ్.. తన లవ్ స్టోరీని బయటపెట్టలేదు. ఎంగేజ్ మెంట్ అయ్యాక కూడా ఈ జంట ఇంటర్వ్యూలు అని, ఫోటోలు, వీడియోలు అని సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలా కనిపించింది లేదు. ఎవరి కెరీర్ ను వారు సెట్ చేసుకొనే పనిలో పడ్డారు. ఇక గాండీవధారి అర్జున ప్రమోషన్స్ లో వరుణ్ తన లవ్ స్టోరీని బయటపెట్టాడు.
Tiger Nageswara Rao: 8 ఏళ్లకే రక్తం తాగిన స్టూవర్టుపురం దొంగ సర్ వాడు..
Also Read
- Ranabaali : 'రణబాలి' వివాదంపై మైత్రి రవిశంకర్ స్పందన.. విజయ్‌పై కీలక వ్యాఖ్యలు
- Billa Ranga Baasha : 2209 ప్రపంచంలో కిచ్చా సుదీప్ యాక్షన్.. 'బిల్లా రంగ బాషా' నుంచి బిగ్ అప్డేట్!
- Pawan Kalyan :మీరు అడిగారు, మేము విన్నాం.. ఓజీ యూనివర్స్‌లోకి స్వాగతం
- Pradeep Ranganathan: ఆ డైరెక్టర్'తో ప్రదీప్ రంగనాథన్ స్ట్రెయిట్ తెలుగు సినిమా!
” లావణ్య నాకు ఐదేళ్లుగా పరిచయం. నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు.. అందులో లావణ్య ఒకరు. చాలాకాలం ఫ్రెండ్స్ గానే ఉన్నాం. ఒకరిని ఒకరు అర్ధం చేసుకున్నాం.. ఇక ఈ బంధాన్ని మరో అడుగు ముందుకు తీసుకెళ్లాలి అని నిర్ణయించుకున్నాం. ముందు నేనే.. లావణ్యకు ప్రపోజ్ చేశా. ఆ తరువాత ఇంట్లో చెప్పాము. వారు ఒప్పుకోవడంతో నిశ్చితార్థం వరకు వెళ్లిపోయాం. ఇక లావణ్య చాలా కేరింగ్ పర్సన్. నాకు ఎన్నో గిఫ్ట్స్ ఇస్తుంది. ఇప్పుడు నేను వాడుతున్న ఫోన్ కూడా ఆ గిఫ్ట్స్ లో ఒకటి. నాకు ఏది ఇష్టం అనేది ఆమెకు తెలుసు.. చాలా మెచ్యూర్డ్ గా ఆలోచిస్తుంది. నాకు సోషల్ మీడియాలో అన్ని పంచుకోవాలని ఉండదు. అందుకే చాలా రేర్ గా కనిపిస్తా.. నా నిశ్చితార్థం లానే పెళ్లి కూడా చాలా సింపుల్ గా చేసుకుంటాం” అని చెప్పాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమా వరుణ్ కు ఎలాంటి హిట్ ను అందిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
TG20 League 2026: రాయుడు ‘హిట్’ ఇన్నింగ్స్.. పాలమూరు స్ట్రైకర్స్ ఘన విజయం!
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మిశ్రమ ఫలితాలు!
-
Ranabaali : ‘రణబాలి’ వివాదంపై మైత్రి రవిశంకర్ స్పందన.. విజయ్‌పై కీలక వ్యాఖ్యలు
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
8849 Tank 5: ప్రొజెక్టర్‌తో 8849 ట్యాంక్ 5 స్మార్ట్‌ఫోన్ విడుదల.. 17,600mAh భారీ బ్యాటరీ, 3K డిస్ప్లే
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!