Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం గాండీవధారి అర్జున అనే సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో వరుణ్ ప్రమోషన్ మొదలుపెట్టాడు.