Varalakshmi : సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు అనేవి చాలా సార్లు తెరమీదకు వచ్చాయి. నటీమణులు తమకు ఎదరైన చేదు అనుభవాలను ఎన్నోసార్లు బయటపెట్టారు. కాస్టింగ్ కౌచ్ పేరుతో వేధింపులకు గురయ్యామంటూ వారు చెప్పుకుని ఎమోషనల్ అయిపోయేవారు. అయితే తాజాగా వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా తనకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంది. ఆమె సినిమాల్లో లేడీ విలన్ గా బాగా పాపులర్ అవుతున్న సంగతి తెలిసిందే కదా. సినిమాల్లో కీలక పాత్రలు కూడా చేస్తోంది. పెళ్లి అయిన తర్వాత కూడా వరుసగా సినిమాల్లో నటిస్తూనే ఉంది ఈ భామ.
Read Also : Delimitation: మరో 25 ఏళ్లు డీలిమిటేషన్ వద్దు.. స్టాలిన్ మీటింగ్‌లో 7-పాయింట్ల తీర్మానం..
అయితే తాజాగా ఆమె ఓ టీవీ షోకు జడ్జిగా వెళ్లింది. అక్కడ ఓ లేడీ కంటెస్టెంట్ తనకు జీవితంలో ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంది. దీంతో వరలక్ష్మీ కూడా తాను ఫేస్ చేసిన వాటిని తెలిపింది. ‘నీది నాది సేమ్. నేను కూడా చిన్నవయసులో చాలా చేదు అనుభవాలను ఎదుర్కున్నాను. నన్ను కూడా ఐదారుగురు వేధించేవారు. కానీ నేను ఎప్పుడూ భయపడలేదు. ధైర్యంగా ముందుకు వెళ్లాను. మన హార్డ్ వర్క్ మనల్ని పైకి తీసుకొస్తుంది’ అంటూ చెప్పుకొచ్చింది. ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అంత పెద్ద హీరో కూతురుకు కూడా వేధింపులు తప్పలేవా అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.