బాబాయ్ పవన్ కళ్యాణ్, అబ్బాయ్ రామ్ చరణ్ సినిమాల సీన్ రివర్స్ అయిందా? అంటే, అవుననే మాట వినిపిస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమాను దర్శకుడు బుచ్చిబాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండగా.. 2026 మార్చి 27న రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నారు. అయితే, ఇప్పుడు పెద్ది పోస్ట్ పోన్ కానుందనే వార్తలు వస్తున్నాయి. కొన్ని కారణాల వల్ల మార్చిలో రావాల్సిన పెద్ది వాయిదా వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ డేట్ కి పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ను రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.
Also Read : Betting App Case : బెట్టింగ్ యాప్ కేసులో సెలబ్రిటీలపై కొనసాగుతున్న సిట్ విచార
ఉస్తాద్ భగత్ సింగ్ భగత్ సింగ్ షూట్ శరవేగంగా జరుగుతోంది. షూటింగ్ జెట్ స్పీడ్ లో రిలీజ్ చేసి సమ్మర్ రిలీజ్ చేయాలనీ చూస్తున్నారట. ఇందులో నిజమెంత అనేది తెలియదు గానీ, ఎలా చూసుకున్న మెగా ఫ్యాన్స్‌కు సంక్రాంతి నుంచి అసలు సిసలైన పండగ మొదలు కాబోతోంది. సంక్రాంతికి చిరంజీవి నటిస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ విడుదల అవుతుండగా మార్చి, ఏప్రిల్‌లో పెద్ది, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు మూడు నాలుగు వారాల గ్యాప్‌లో థియేటర్లోకి రాబోతున్నాయి. ఇక మే నెలలో మరోసారి సందడి చేయడానికి రెడీ అవుతున్నారు చిరు. ఆయన నటించిన సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ మే నెలలో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. అయితే, ఈ సినిమాల రిలీజ్ డేట్స్ విషయంలో మేకర్స్ సైడ్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. కానీ వచ్చే ఏడాది ప్రథమార్థంలో మెగా హీరోలు తమ అభిమానులకు ఓ రేంజ్ ట్రీట్ ఇవ్వబోతున్నారనే చెప్పాలి.