బెట్టింగ్ యాప్ కేసులో కొనసాగుతున్న సిట్ విచారణ కొనసాగుతుంది. బెట్టింగ్ యాప్ లను సినీ, టీవీ ఇండస్ట్రీకి చెందిన 25 మంది సెలబ్రిటీలు ప్రచారం చేసినట్లుగా గుర్తించారు. ఇప్పటివరకు 22 మంది నుండి స్టేట్మెంట్లు రికార్డు చేసింది సిట్. టాలీవుడ్ హీరోలైన దగ్గుబాటి రానా, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, అనన్యనాగళ్ళ లతోపాటు యాంకర్లు విష్ణు ప్రియ, శ్యామల, హర్ష సాయి, టేస్టీ తేజ లతోపాటు మరికొంతమంది వాంగ్మూలాలను సిట్ అధికారులు రికార్డు చేశారు. మంచు లక్ష్మి, రీతు చౌదరి, భయ్యా సన్నీయాదవ్ ల స్టేట్మెంట్స్ రికార్డు చేయాల్సి ఉందని తెలిపింది సిట్. వీరిలో రీతు చౌదరి ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉండగా సన్నీ యాదవ్ విదేశాలలో ఉన్నాడు. మంచి లక్ష్మి మరికొంత సమయం కావాలంటూ ఇప్పటికే సిట్ నుండి గడువు కోరింది.
Also Read : Netflix : నెట్ ఫ్లిక్స్ షాకింగ్ నిర్ణయం.. సౌత్ సినిమాలకు ఇక కష్టమే
ఇప్పటివరకు స్టేట్మెంట్లు ఇచ్చిన వారిని బెట్టింగ్ యాప్ ల ప్రమోట్ గురించి క్షుణ్ణంగా ఆరా తీశారు సిట్ అధికారులు. బెట్టింగ్ యాప్ లను ఎందుకు ప్రమోట్ చేయాల్సి వచ్చింది. అందుకుగల కారణాలను స్టేట్మెంట్ రూపంలో రికార్డు చేసారు. బెట్టింగ్ యాప్ ప్రమోట్ ద్వారా పారితోషకాలు ఎంత తీసుకున్నారు, కేవలం పారితోషకమే తీసుకున్నారా లేదా మరేదైనా ఇతర అవసరాలు కూడా ఉన్నాయాని ఆరాతీశారు సిట్ అధికారులు. తాము జరిపిన లావాదేవీలకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ లను సిట్ అధికారులకు సమర్పించారు పలువురు సెలెబ్రిటీలు. ముందుగా 25 మంది వాంగ్మూలాలు రికార్డు పూర్తైన తర్వాత తదుపరి చర్యలు. వాంగ్మూలాలు ఇచ్చిన వారి స్టేట్మెంట్లను పరిశీలించనున్న సిట్. విచారణలో తప్పుడు సమాచారమిచ్చినట్లు తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు సిట్ అధికారులు.