ఓవర్ సీస్ లో ఎన్నో తెలుగు సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ హ వ్యవహరించిన ఫికస్ డిస్టిబ్యూషన్ సంస్థ అధినేత హరీష్ సజ్జ ఆకస్మిక మరణం చెందారు. అట్లాంటాలోని ఇంట్లో ఉండగా అకస్మాతముగా గుండెపోటు రావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికె అయన మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు .
కాగా USAలోని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీలలో ఒకటైన ఫికస్‌కు చెందిన హరీష్ సజ్జా రాఖీ చిత్రంతో యుఎస్ డిస్ట్రిబ్యూటర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ చిత్రం సక్సెస్ కావడంతో ఇక వెనుతిరిగి చూసుకోలేదు. వరుస సినిమాలతో యూఎస్ లో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ గ పేరుతెచుకున్నారు. ముఖ్యంగా 2008 నుండి 2016 వరకు దాదాపు ఒక దశాబ్దం పాటు యుఎస్‌లో అతిపెద్ద పంపిణీదారుగా క్రియాశీలకంగా వ్యవహరించారు. అదే తరుణంలో మహేష్ బాబు ఇండస్ట్రీ హిట్ దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, రోబో, రేస్ గుర్రం, 1 నేనొక్కడినే, ఆగడు, జనతా గ్యారేజ్ మొదలైన అనేక భారీ చిత్రాలను ఓవర్ సీస్ లో పంపిణీ చేసారు. USAలో మొదటి మిలియన్ డాలర్ల చిత్రంగా రికార్డు నమోదు చేసిన దూకుడు పంపిణిదారులు హరీష్ సజ్జా.
నేడు ఆయన ఆకస్మిక మరణంతో కుటుంభ సభ్యులు శోకసంద్రంలో మునిపోయారు. హరీష్ సజ్జా ఆత్మకు శాంతి కలగాలని తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు తమ సంతాంపం తెలిపారు.