Urvashi Rautela: బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా.. టాలీవుడ్ ఐటెం సాంగ్ హీరోయిన్ గా మారిపోయింది. వాల్తేరు వీరయ్య చిత్రంలో బాస్ పార్టీ అంటూ ఎంట్రీ ఇచ్చి.. అదరగొట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఇక మొదటి సాంగ్ తోనే వరుస అవకాశాలు అందుకుంది. వెంటనే ఏజెంట్ సినిమాలో మెరిసిన ఈ బ్యూటీ.. ఆ తరువాత పవన్ – తేజ్ కాంబోలో వస్తున్న బ్రో సినిమాలో ఐటెం సాంగ్ ఛాన్స్ కొట్టేసి ఔరా అనిపించింది. ఇప్పటికే సాంగ్ షూట్ ను కూడా పూర్తిచేసిన ఈ ముద్దుగుమ్మ తాజాగా మరో పాన్ ఇండియా సినిమాలో ఐటెం సాంగ్ ఛాన్స్ పట్టేసింది. పుష్ప 2 లో ఈ చిన్నది ఐటెం సాంగ్ చేస్తుందని పుకార్లు వినిపిస్తున్నాయి. అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ చిన్నది మాత్రం బాలయ్య సినిమాలో నటిస్తూ బిజీగా మారింది.
వాల్తేరు వీరయ్య తరువాత డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహిస్తున్న చిత్రం NBK109. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్ల మీద నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలయ్యకు ధీటుగా బాబీ డియోల్ నటిస్తుండగా.. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇక బాబీ ఏమైనా సెంటిమెంట్ ను నమ్ముతున్నాడో ఏమో కానీ, వాల్తేరు వీరయ్య సినిమాలో ఐటెంసాంగ్ చేసిన ఊర్వశీనే.. ఈ సినిమాలో కూడా తీసుకొచ్చాడు. అయితే ఈసారి ఐటెంసాంగ్ కోసం కాకుండా ఒక కీలక పాత్ర కోసం బాబీ.. ఊర్వశీని దింపాడు. ఇక ఆమె.. సెట్ లో అడుగుపెట్టింది. నిన్న ఊర్వశీ పుట్టినరోజు వేడుకలు NBK109 సెట్ లో గ్రాండ్ గా జరిగాయి. ఇక ఈ వీడియోను ఊర్వశీ పోస్ట్ చేస్తూ NBK109 టీమ్ కు థాంక్స్ చెప్పుకొచ్చింది. ఏదిఏమైనా డైరెక్టర్.. ఈ హాట్ బ్యూటీని సెంటిమెంట్ గా పెట్టుకున్నట్లు కనిపిస్తుంది. మరి ఈ సినిమాతో అమ్మడు ఐటంసాంగ్స్ కాకుండా నటనతో మెప్పించి ఇంకా అవకాశాలను అందుకుంటుందేమో చూడాలి.