మనోరమ పేరు వింటే ఈ తరం వారికి ఆమె నటించిన ముసలి వేషాలే ముందుగా గుర్తుకు వస్తాయి. 1958 నుండి 2015 దాకా అంటే 57 సంవత్సరాలు చిత్రసీమలో తనదైన బాణీ పలికిస్తూ, దాదాపు 1500 చిత్రాలలో నటించి ప్రపంచ రికార్డ్ నెలకొల్పారు మనోరమ. అన్ని చిత్రాలలో నటించిన నటి మరొకరు మనకు కానరారు. తెలుగు, తమిళ భాషల్లో అత్యధిక చిత్రాలలో తల్లి పాత్రలు పోషించి మెప్పించారు. కొన్ని చిత్రాలలో కథానాయికగానూ నటించారు. హాస్య పాత్రల్లో తనకు…
తమిళ స్టార్ హీరో ధనుష్ పేరు వినగానే, ఆయన విలక్షణమైన అభినయం ముందుగా గుర్తుకు వస్తుంది. ధనుష్ తండ్రి కార్తిక్ రాజా తమిళ చిత్రసీమలో పేరు మోసిన రచయిత, దర్శకుడు. అన్న సెల్వరాఘవన్ పేరున్న దర్శకుడు. ఆరంభంలో వారి నీడన నిలచిన ధనుష్ తరువాత సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు అయ్యాడు. ఇవన్నీ ధనుష్ కు మొదటిరోజుల్లో కాసింత గుర్తింపు తేవడానికి పనికి వచ్చాయి. తరువాత అంతా ధనుష్ స్వయంకృషితో సాధించుకున్నదే. తమిళ, తెలుగు, మళయాళ చిత్రాల్లో…
ప్రముఖ నేపధ్య గాయని, భారతరత్న అవార్డు గ్రహీత లతా మంగేష్కర్ కొన్నిరోజుల క్రితం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే లతా కరోనాతో పాటు న్యుమోనియాతో కూడా బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఆమె ఆరోగ్యం ప్రస్తుతం విషమంగా ఉందని సమాచారం. అందుకే వైద్యులు ఆమె ఆరోగ్య పరిస్థితిని బయటకు తెలపడం లేదని చెన్నై వర్గాలు తెలుపుతున్నాయి. 92 ఏళ్ల లతా గతకొన్నిరోజులుగా ఐసీయూలోనే చికిత్స పొందుతున్నారు. ఆమె…