Upasana Konidela: మెగా ఫ్యామిలీ ఇంట సంబరాలు మొదలయ్యాయి. పదేళ్ల తరువాత రామ్ చరణ్- ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కానున్నారు. త్వరలోనే మెగా వారసుడు రానున్నాడు. ఇక ఈ విషయం తెలియడంతో ఉపాసన ఆనందానికి అవధులు లేవు.. చిరు, సురేఖ అయితే సంతోషం పట్టలేకపోయారట. ఉపాసన గర్భవతి అయిన నేపథ్యంలో పిల్లల గురించి, వారి పెంపకం గురించి ఆమె గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
“పిల్లలను కనడం అనేది 20 సంవత్సరాల ప్రాజెక్టు.. మా బిడ్డకు అన్ని అందించే విధంగా ప్లాన్ చేయాలనుకుంటున్నాం. మేము కుక్కులను- గుర్రాలను ఎంతో ప్రేమగా చూసుకుంటాం. అలాంటిది మా బిడ్డను ఇంకెంత జాగ్రత్తగా చూసుకుంటమో ఊహించవచ్చు. ఇది మాకు చాలా ముఖ్యమైనది. బిడ్డను కనడమే కాదు.. వారిని క్రమశిక్షణలో పెంచడం ముఖ్యం. ఆ విషయంలో మాకంటూ కొన్ని ప్లానింగ్స్ ఉన్నాయి”అని చెప్పుకొచ్చింది. ఇక ఇప్పుడు ఆ 20 ఏళ్ల ప్లానింగ్ నెరవేరబోతోంది. అన్నింటికి ఉపాసన బ్రేక్ ఇవ్వనుంది. తల్లిగా బిడ్డ బాధ్యతలను అన్ని అందుకోనుంది. చరణ్ సైతం ఆ మూమెంట్ కోసం ఎదురుచూస్తున్నాడు. త్వరలోనే మెగా వారసుడు చిరు గుండెలపై ఆడనున్నాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.