Upasana : ఉపాసన పేరు ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోనే ఉంటుంది. హెల్త్ గురించి ఆమె ఎప్పటికప్పుడు చేసే సూచనలు సోషల్ మీడియాలో చర్చలకు దారి తీస్తాయి. రీసెంట్ గా ఆమె ఐఐటి హైదరాబాద్ స్టూడెంట్స్ తో ఇంటరాక్షన్ సందర్భంగా యువతకు కెరీర్ మీద కొన్ని సలహాలు ఇచ్చింది. అమ్మాయిలు కెరీర్ లో సక్సెస్ అయ్యాకే పెళ్లి చేసుకోవాలని తెలిపింది. 30 ఇయర్స్ దాటిన అమ్మాయిలు తమ ఎగ్స్ ను ఫ్రీజ్ చేసుకోవాలని సూచించింది. అయితే ఆమె కామెంట్స్ పై రకరకాల చర్చ జరుగుతుంది. కొందరు ఆమెను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అందరి సిచ్యువేషన్ మీలా ఉండదని.. మీ అంత డబ్బు ఉంటే అందరూ అలాగే చేసే వారిని కామెంట్స్ చేస్తున్నారు.
Read Also : Samantha : సమంతపై రాజ్ నిడుమోరు ఆసక్తికర కామెంట్స్
ఒక స్థాయిలో ఉన్న మీరు యూత్ కు ఎలాంటి సందేశం ఇస్తున్నారు అంటూ మండిపడుతున్నారు. దీనిపై తాజాగా ఉపాసన స్పందించింది. మీ కామెంట్స్ కు మీ గౌరవమైన స్పందనకు చాలా థాంక్స్ అంటూ ట్వీట్ చేసింది. నేను చేసిన కామెంట్స్ పై ఆరోగ్యకరమైన చర్చ జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. అమ్మాయిలను శ్రామిక శక్తిలోకి తీసుకురావడానికి అందరం కలిసి పనిచేద్దాం అంటూ తెలిపింది. అలాగే ఫ్యాక్ట్ చెక్ పేరుతో ఒక నోట్ కూడా రిలీజ్ చేసింది. తనకు 29 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు ఎగ్స్ ఫ్రీజ్ చేసుకున్నానని.. అది తన హెల్త్ కండిషన్ వల్ల చేసుకున్నట్టు తెలిపింది. తన జర్నీలో పెళ్లి పిల్లలను కెరీర్ ను సమానంగా బ్యాలెన్స్ చేసినట్టు వివరించింది.
Read Also : Off The Record : ఎచ్చెర్లలో అగమ్యగోచరంగా టీడీపీ కేడర్ పరిస్థితి..