Upasana: మెగా కోడలి సీమంతం చేసిన ఆడపడుచులు.. భలే ఉన్నారే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Upasana: మెగా కుటుంబం మొత్తం వారసుడు కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన పదేళ్ల తరువాత తల్లిదండ్రులుగా మారనున్నారు. ఇన్నేళ్లు ఈ జంట పిల్లల విషయంలో ఎన్ని విమర్శలు అందుకున్నారో అందరికి తెలిసిందే. ఆ విమర్శలను కూడా ఈ జంట చాలా పాజిటివ్ గా తీసుకొని ముందుకు వెళ్లారు. ఇక వారు అనుకున్నట్లుగానే పదేళ్ల తర్వాత తమ బిడ్డను భూమి మీదకు తీసుకురానున్నారు. ఇక ఉపాసనకు ప్రస్తుతం 8వ నెల. దీంతో ఉపాసనకు అత్తగారు సమక్షంలో ఘనంగా సీమంతపు వేడుకలు జరిగాయి. గతరాత్రి అతి తక్కువ బంధుమిత్రుల సమక్షంలో ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఇక ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఉపాసన షేర్ చేస్తూ తన ఆనందాన్ని వ్యక్తపరిచింది. “మీ ప్రేమకు మేము ఇద్దరం ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నాం. సుష్మిత, శ్రీజ, స్మిత, సైర్న్ మీకు చాలా థాంక్స్.. నాకు ఇంత అద్భుతమైన సీమంతం చేసినందుకు.. మా బేబీ నిజంగా ఎంతో అదృష్టం చేసుకుంది” అని చెప్పుకొచ్చింది.
Anchor Suma: అందరు చూస్తుండగానే సుమ గొంతు పట్టుకొని వార్నింగ్ ఇచ్చిన హీరో గోపీచంద్..
Also Read
ఇక ఫొటోస్ లో ఉపాసన, చరణ్ హైలైట్ గా నిలిచారు. బ్లూ కలర్ డ్రెస్ లో ఉపాసన, వైట్ అండ్ వైట్ డ్రెస్ లో చరణ్ అల్ట్రా స్టైలిష్ లుక్ అదిరిపోయింది. మామ చిరు, అత్తా సురేఖ, ఆడపడుచులు శ్రీజ, సుస్మిత వారి పిల్లలతో చరణ్, ఉపాసన దిగిన ఫోటో అదిరిపోయింది. ఈ వేడుకలో ఉపాసన స్నేహితులు, వారి కుటుంబం కూడా కనిపించారు. ఉపాసన అమ్మ, చెల్లి, నాన్నమ్మ కూడా మెరిశారు. ఇక ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారింది. ఉపాసన సీమంతపు ఫోటోలు చూడడానికి రెండు కళ్ళు చాలడం లేదే అని మెగా అభిమానులు చెప్పుకొస్తున్నారు.
తాజావార్తలు
-
Manchu Manoj: అనాథలకు అండగా మంచు మనోజ్.. త్వరలో భారీ పునరావాస కేంద్రం!
-
CM Revanth: వర్షాలు పడుతున్నాయి.. ముందస్తు చర్యలు చేపట్టండి.. అధికారులకు సీఎం ఆదేశాలు.!
-
Balka Suman: మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై కేసు నమోదు
-
SRH vs RR Eliminator: కళ్లు చెదిరే గణాంకాలు వర్మ.. ఎలిమినేటర్‌లో బౌలర్లకు అతి పెద్ద సవాల్ ఆ ఇద్దరే!
-
YS Jagan: వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు.. రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్‌తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!
-
Raw Mango Roti Pachadi: అమ్మ చేతి రుచిని గుర్తు చేసే పుల్లటి “మామిడికాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!