‘ఆహా’లో ప్రసారమవుతున్న సెలబ్రిటీ టాక్ షో ‘అన్‌స్టాపబుల్’లో నందమూరి బాలకృష్ణ తన హోస్టింగ్ నైపుణ్యంతో తెలుగు ప్రేక్షకులను, అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఆయన హోస్టుగా మారినప్పటి నుంచి హాస్యంతో పాటు తన తోటి నటీనటులతో మెలుగుతున్న తీరు అన్ని వర్గాల ప్రేక్షకులను, అందరు హీరోల అభిమానులనూ మెప్పిస్తోంది. మొదటి సీజన్ షూటింగ్ నిన్నటితో పూర్తయింది. నెక్స్ట్ ఎపిసోడ్‌లు త్వరలో ప్రసారం కానున్నాయి. అయితే తాజాగా బాలయ్య షో ఓ రేర్ ఫీట్ ను సాధించింది.
Read Also : ‘ఆర్ఆర్ఆర్’కు మరో కష్టం… విడుదల ఆపాలంటూ కోర్టులో పిల్
IMDBలోని టాప్ 10 రియాలిటీ టీవీ జాబితాలో ‘అన్‌స్టాపబుల్’ స్థానం దక్కించుకుంది. ఈ తెలుగు టాక్ షోకి ఇది అరుదైన విజయం. ‘అన్‌స్టాపబుల్’ టాప్ రేటింగ్ లతో ఈ జాబితాలో ఐదవ స్థానంలో ఉంది. ఇటీవల పూరి జగన్నాధ్, విజయ్ దేవరకొండలతో బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్’ చివరి ఎపిసోడ్‌ను చిత్రీకరించారు. ‘ఆహా’ మేకర్స్ ప్రేక్షకుల నుంచి ఈ రెస్పాన్స్‌తో థ్రిల్ అవుతున్నారు. తెలుగు డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఈ సంవత్సరం చివర్లో రెండవ సీజన్ కోసం ప్లాన్ చేస్తోంది. కాగా ఈ నెలలో ప్రారంభం కానున్న గోపీచంద్ మలినేని యాక్షన్ ఎంటర్‌టైనర్ సెట్స్‌లో బాలయ్య త్వరలో చేరనున్నారు. బాలకృష్ణకు వరుస సినిమాలు ఉన్నాయి. ‘అఖండ’ విజయంతో ఫుల్ జోష్ లో ఉన్న బాలయ్యతో కలిసి పని చేయడానికి చాలా మంది యువ దర్శకులు ఆసక్తిగా ఉన్నారు.