‘ఆర్ఆర్ఆర్’కు మరో కష్టం… విడుదల ఆపాలంటూ కోర్టులో పిల్

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికి అడుగడుగా అడ్డంకులు తప్పట్లేదు. ఇప్పటికే సినిమాను కరోనా కారణంగా 4 సార్లు వాయిదా వేశారు మేకర్స్. అయితే తాజాగా ఈ సినిమాకు మరో కష్టం వచ్చింది. ఈ చిత్రం విడుదలను ఆపాలంటూ తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా సత్యవరపు ఉండ్రాజవరానికి చెందిన అల్లూరి సౌమ్య అనే మహిళ ఈ పిటిషన్‌ దాఖలు చేసింది. స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతా రామరాజు, కొమరం భీమ్‌లను అవమానించేలా, వారి అనుచరుల మనోభావాలను దెబ్బతీసేలా… సినిమాలో ఉద్దేశపూర్వకంగా నిజమైన వీరుల చరిత్రను మూవీ టీం వక్రీకరించిందని పిటిషనర్ ఆరోపించారు.

Read also : అఫిషియల్ : “అఖండ” ఓటిటి కోసం అప్పటిదాకా ఆగాల్సిందే…!

సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వొద్దని, విడుదలపై స్టే విధించాలని పిటిషనర్ డిమాండ్ చేశారు. ఈ పిటిషన్‌ విచారణ కోసం జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ వెంకటేశ్వర రెడ్డి ధర్మాసనం ముందుకు వచ్చింది. ఈ వ్యాజ్యం ప్రజాహిత వ్యాజ్యం కాబట్టి సీజే ధర్మాసనం విచారణ జరుపుతుందని జస్టిస్ ఉజ్జల్ భుయాన్ తెలిపారు. అయితే ‘ఆర్ఆర్ఆర్’ దర్శకుడు రాజమౌళి ఎప్పటి నుంచో ఈ సినిమా కల్పిత కథ మాత్రమేనని, వారి నిజం జీవితంతో దీనికి సంబంధం లేదని చెప్తూనే ఉన్నాడు. ఈ సినిమా జనవరి 7న విడుదల కావాల్సి ఉండగా దేశంలో కరోనా మూడో వేవ్ ముదురుతున్న కారణంగా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో సినిమా విడుదలను ఆపాలని డిమాండ్ చేస్తూ పిల్ దాఖలు చేయడం గమనార్హం. మరి ఈ అంశంపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Related Articles

Latest Articles