UnStoppable 2: నందమూరి ఫ్యాన్స్ సిద్ధంకండమ్మా.. వచ్చేస్తున్నాడు నందమూరి నట సింహం.. వెండితెరపై తనదైన డైలాగ్ డెలివరీతో రచ్చ చేస్తున్న బాలయ్య బుల్లితెరపై అంతకన్నా ఎక్కువ రచ్చ చేయడానికి అన్ స్టాపబుల్ సీజన్ 2 తో వచ్చేస్తున్నాడు. నందమూరి బాలకృష్ణ ఏంటి.. హోస్ట్ గా చేయడమేంటి.. ఎవడు చూస్తాడు అన్నవారే.. బాలయ్య హోస్ట్ గా చేస్తేనే షో చూస్తాం అనేలా మార్చేశాడు. ఒకరు కాదు ఇద్దరు కాదు 10 మంది స్టార్లు.. ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టనివ్వకుండా ప్రేక్షకులకు నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ ఇచ్చేశాడు. ఇక పదిమంది తో సీజన్ ముగిసిపోవడంతో సీజన్ 2 ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న నందమూరి ఫ్యాన్స్ కు ఆహా గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే అన్ స్టాపబుల్ సీజన్ 2 మొదలుకానున్నదని తెలుపుతూ అన్ స్టాపబుల్ సీజన్ 2 ఆంథెమ్ ను రిలీజ్ చేసింది. మహాతి స్వర సాగర్ సంగీత సారథ్యంతో ర్యాపర్ రోల్ రైడా ఈ సాంగ్ ను ఆలపించాడు.
“తను ఎంట్రీ ఇస్తే కంట్రీ అంతా ఊగేనంటా.. డైలాగ్ వదిలితే మోగిపోద్ది బాడీ అంతా.. మాటలు తప్పుకొని వెళ్ళలేవు రాంగ్ వే.. బికాజ్ హి ఈజ్ వన్ వే..” అంటూ ర్యాప్ అదిరిపోయింది. ఇక వీడియోలో అన్ స్టాపబుల్ సీజన్ 1 లో వచ్చిన గెస్టులను అందరిని చూపిస్తూ బాలకృష్ణ గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి రాసిన లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా మధ్య మధ్యలో బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్స్ తో ర్యాప్ ఇచ్చి సాంగ్ కు హైలైట్ గా మార్చాడు రోల్ రైడా. ఇక ఈ షో లో తమ స్వశక్తిగా నిలబడిన వారికి సన్మానం చేయడం, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం లాంటివి కూడా చూపించి బాలయ్య ఎలాంటి వ్యక్తి అన్నది చూపించారు. ఇక సెట్ లో బాలయ్య వేసే డ్యాన్స్, క్యాస్టూమ్స్ అన్ని ఈ వీడియోలో పొందుపరిచారు. మోహన్ బాబు దగ్గర నుంచి మహేష్ బాబు వరకు వచ్చిన ప్రతి గెస్టు తో బాలయ్య ఎలా ఆడుకున్నాడు అనేది చూపించారు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ముందు నుంచి బాలయ్య ఏ వీడియోకైనా ఈ ర్యాప్ సాంగ్ నే ఎడిట్ చేస్తారు అంటే అతిశయోక్తి లేదు. ఇక ఈ షో త్వరలోనే ప్రారంభం కానున్నదని తెలుస్తోంది. మరి ఈ సారి ఈ షోకు ఎలాంటి తారలు రానున్నారు..? వారిని బాలయ్య ఎలాంటి ప్రశ్నలు వేయనున్నాడు..? అనేది చూడాల్సిందే.
https://www.youtube.com/watch?v=TWjWSHFOClk