Unstoppable 2: దెబ్బకు థింకింగ్ మారిపోవాలని అంటున్నాడు బాలయ్య.. వరుస సినిమాలతో బిజీగా ఉన్న బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో అన్ స్టాపబుల్. సీజన్ 1 ను విజయవంతంగా పూర్తిచేసిన బాలయ్య సీజన్ 2 కూడా రచ్చ రచ్చే అని చెప్పుకొచ్చాడు. ఆహాలో ప్రసారం కానున్న ఈ షో ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. సీజన్ 1 కు మించి సీజన్ 2 ఉండబోతుందని బాలయ్య చెప్పి హైప్ క్రియేట్ చేశాడు. “అంధకార భయారణ్యంలో నిక్షిప్తమైన నిగూఢ నిధి”అంటూ ఒక గుహలో ఎంటర్ అయిన బాలకృష్ణ బేస్ వాయిస్ తో ప్రోమో మొదలయ్యి ఆద్యంతం ఆకట్టుకొంటుంది. వేటగాడు లా బాలకృష్ణ ఆ గుహలో ఉన్న నిధి కోసం వెతుకుతూ అన్ స్టాపబుల్ షో గురించి చెప్పుకుంటూ లోపలికి వెళ్తాడు. ఇక బాలకృష్ణ సాహస విన్యాసాలు చేసి నిధిని కైవసం చేసుకొని అన్ స్టాపబుల్ సెట్ లో అడుగుపెడతాడు.
ప్రశ్నల్లో మరింత ఫైర్.. ఆటల్లో మరింత డేర్.. సరదాల్లో మరింత సెటైర్.. మీకోసం మరింత రంజుగా.. అన్ స్టాపబుల్ 2.. దెబ్బకు థింకింగ్ మారిపోవాలా అంటూ బాలయ్య తొడకొట్టి చెప్పి రచ్చ లేపాడు. ఇక ఈ ప్రోమోకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు. ఇక బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో బాలయ్య లుక్ అదిరిపోయిందని చెప్పాలి. మొత్తానికి ఈ ప్రోమోతో షో పై భారీ అంచనాలను రేకెత్తించారు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. త్వరలోనే ఈ షో ఆహా ఓటిటీ లో ప్రసారం కానుంది. మరి ఈసారి బాలయ్య ఏ విధంగా ఈ షోను సక్సెస్ చేస్తాడో చూడాలి.
https://youtu.be/o3EVYEEDEqI