Udaya Bhanu : ఈ మధ్య యాంకర్ ఉదయభాను బాగా ట్రెండ్ అవుతోంది. ముఖ్యంగా ఇండస్ట్రీలో తన అవకాశాలపై రీసెంట్ గా చేసిన కామెంట్లు దుమారం రేపాయి. ఇండస్ట్రీలో యాంకర్లు కొందరు సిండికేట్ అయిపోయారని బాంబు పేల్చింది. తాజాగా ఆమె నటిస్తున్న మూవీ త్రిబాణధారి బార్బరిక్. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని యాంకరింగ్ అవకాశాలపై మాట్లాడింది. నేను ఆ రోజు మాట్లాడింది జోక్ గానే. కానీ అదే నిజం. ఇండస్ట్రీలో ఎన్నో జరుగుతున్నాయి. నన్ను తొక్కేసే వాళ్లే ఎక్కువగా ఉన్నారు. నాకు పెద్దగా ఎంకరేజ్ మెంట్ లేదు అంటూ చెప్పింది.
Read Also : Raj Kundra : నా కిడ్నీ స్వామీజీకి ఇస్తా.. హీరోయిన్ భర్త షాకింగ్ కామెంట్స్
ఇండస్ట్రీలో సిండికేట్ అయిపోయారు. ఒక్కోసారి కొన్ని ఈవెంట్లకు నా డేట్లు తీసుకున్న తర్వాత షో కోసం అక్కడకు వెళ్లాక నన్ను వద్దని చెప్పేవాళ్లు. ఉదయభాను ఒక షో చేస్తోంది అంటే ఆమెను ఎందుకు తీసుకున్నారు అనే వాళ్లే ఎక్కువ. అప్పటికప్పుడు సడెన్ గా నన్ను తీసేసేవాళ్లు. ఎన్నో బాధలు పడ్డాను. చిన్న షోలు చేస్తే నా కంటే చిన్న యాంకర్లకు అవకాశాలు రాకుండా పోతాయి. అందుకే ఏది పడితే అది చేయట్లేదు. త్వరలోనే నేను అన్నీ బయటపెడుతాను. ఎందుకంటే తర్వాత వచ్చే వాళ్లకు తెలియాలి కదా అంటూ సంచలన కామెంట్లు చేసింది ఉదయభాను. దీంతో ఆమె మాటలు ఇండస్ట్రీలో ప్రకంపనలు రేపుతున్నాయి.
Read Also : Krithi Sanon : ప్రభాస్ హీరోయిన్ లగ్జరీ ఫ్లాట్.. ఎన్ని కోట్లంటే..?