విక్టరీ వెంకీతో సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ ఇచ్చిన అనిల్ రావిపూడి ఇప్పుడు చిరుతో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. ఇటీవల ఈ సినిమాను అధికారకంగా ప్రకటించి పూజ కార్యక్రమాలు కూడా నిర్వహించారు. భారీ చిత్రాల నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ నెల 22 నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది యూనిట్. ఈ సినిమాతో వింటేజ్ చిరు మరోసారి ప్రేక్షకులను అలరిస్తాడని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు.
కాగా ఈ సినిమాలో చిరు సరనస హీరోయిన్ గా పలువురి పేర్లు వినిపించగా ఫైనల్ గా కోలీవుడ్ లేడి సూపర్ స్టార్ నయనతారకు ఫిక్స్ చేసారు. అయితే ఈ చిత్రంలో నయనతార పాటు మరో భామ కూడా చిరు తో స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సరైనోడులో ఆడిపాడిన కేథరిన్ థెరిస్సా ఇప్పుడు చిరు అనిల్ సినిమాలో కీలక పాత్ర పోషించనుందట. గెస్ట్ రోల్ లో కాకుండా సినిమా ఆసాంతం ఉండే రోల్ లో కేథరిన్ నటించనుందని యూనిట్ సమాచారం. లాంగ్ గ్యాప్ తర్వాత కేథరిన్ తెలుగులో బిజీ అవుతోంది. ఇటీవల విఎన్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమాను అనౌన్స్ చేసింది కేథరిన్. ఇప్పుడు మెగాస్టార్ సినిమాలో నటించే అవకాశంతో జాక్ పాట్ కొట్టింది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న చిరు అనిల్ సినిమాను 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత అనిల్- బీమ్స్ కలయికలో వస్తున్న రెండవ సినిమా మెగా 157 కి సంభందించి పాటలు ఎప్పుడో రెడీ చేసాడు భీమ్స్.