ఇప్పుడున్నది మహానటి కాదు.. కళావతి అంటూ.. తెగ హల్ చల్ చేస్తోంది కీర్తి సురేష్. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటో షూట్స్ షేర్ చేస్తూ రచ్చ చేస్తోంది. దాంతో అసలు ఈమె కీర్తినేనా అనే సందేహం వస్తోంది.. కానీ ఈ బ్యూటీ మాత్రం అస్సలు తగ్గడం లేదు. దాంతో అప్ కమింగ్ ఫిల్మ్స్‌తో కళావతి సోకులు చూడతరమా.. అనే చర్చలో ఉన్నారు అభిమానులు. అయితే అప్పుడప్పుడు కీర్తి సురేష్ తెగ ట్రోల్స్‌కు గురవుతోంది. తాజాగా ఇప్పుడు మణిరత్నంను రిజెక్ట్ చేసిందని.. తెగ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. దర్శకుడిగా మణిరత్నం క్రేజ్ గురించి ప్రత్యేకంగ చెప్పనక్కర్లదు. ఆయన సినిమాలో నటించే చాన్స్ కోసం స్టార్ హీరో, హీరోయిన్లు సైతం ఎదురుచూస్తుంటారు. అయితే.. అలాంటి స్టార్ డైరెక్టర్ పిలిచి మరీ చాన్స్ ఇస్తే.. నో చెప్పిందట కీర్తి సురేష్. ప్రస్తుతం మణిరత్నం తెరకెక్కిస్తున్న పొన్నియన్ సెల్వన్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. రీసెంట్‌గా రిలీజ్ అయిన టీజర్ కూడా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో విక్రమ్, కార్తి, ఐశ్వర్య రాయ్, జయం రవి, త్రిష వంటి స్టార్స్ నటిస్తున్నారు.
ఈ సినిమాలోనే కీర్తి గోల్డెన్ ఛాన్స్ మిస్ అయినట్టు లేటుగా వెలుగులోకి వచ్చింది. మణిరత్నం నుంచి కీర్తికి పిలుపు వచ్చిన సమయంలో.. డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోయిందట.. దాంతో డేట్స్ లేవని లక్కీ చాన్స్ వదుకుందట అమ్మడు. అప్పటికే రజనీకాంత్‌కు చెల్లెలిగా అన్నాత్తే.. మహేష్ సరసన ‘సర్కారు వారి పాట’ మూవీతో బిజీగా ఉందట కీర్తి. దాంతో మణిరత్నం మూవీకి నో చెప్పిందని కోలీవుడ్ వర్గాల సమాచారం. అందుకే ఆమె ప్లేస్‌లో త్రిషని తీసుకున్నట్టు టాక్. అయితే కీర్తి నో చెప్పడానికి అసలు కారణం ఇదేనా.. అనే సందేహం కూడా రాక మానదు. కానీ ఈ విషయం తెలిసిన తర్వాత కీర్తి ఫ్యాన్స్ మాత్రం ఫైర్ అవుతున్నారు. మణిరత్నం లాంటి స్డార్ డైరెక్టర్ ఛాన్స్ ఇస్తే నో చెప్తావా.. కీర్తికి బ్యాడ్ లక్.. అంటూ రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఏదేమైనా.. ప్రస్తుతం తెలుగులో నాని సరసన దసరా.. భోళా శంకర్‌లో చిరు చెల్లెలిగా నటిస్తున్న కీర్తి.. ఫ్యూచర్లో మణిరత్నం సినిమాలో ఛాన్స్ అందుకుంటుందేమో చూడాలి.