Trivikram Speech at Guntur Kaaram Pre Release Event: గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో త్రివిక్రమ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అసలు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ గుంటూరులో నిర్వహించడానికి కారణం సినిమా పేరు గుంటూరు కారం అవ్వడమే అంటూ మొదలు పెట్టిన ఆయన రెండో కారణం మహేష్ మీ వాడు, మనందరి వాడు అందుకే ఆయన మీ మధ్య ఈ ఫంక్షన్ చేయాలని షూటింగ్లో బాగా అలసిపోయి రెస్ట్ తీసుకుంటున్నా సరే హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాడని చెప్పుకొచ్చారు. అందుకని మీరు కొంచెం క్రమశిక్షణగా మెలిగి పోలీసు వారికి సహకరిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. నేను చాలాసేపటి నుంచి చూస్తున్నాను పోలీసులు కంట్రోల్ చేయలేకపోతున్నారు చాలా త్వరగా ఈవెంట్ ముగించేద్దాం అని చెప్పుకొచ్చారు. సూపర్ స్టార్ కృష్ణ గారు తెలుగు సినిమాలో విడదీయలేని ఒక అంతర్భాగం, అలాంటి ఒక గొప్ప నటుడు, మహామనిషి అలాంటి ఆయనతో నేను నేరుగా పని చేయలేకపోయాను. కానీ ఆయన పని చేసిన సినిమాకి పోసాని కృష్ణ మురళి గారి దగ్గర రైటర్ గా పని చేశాను. ఆయనతో నాకు నేరుగా పరిచయం కలిగిన సందర్భం అది ఒక్కటే అని అన్నారు. ఆ తర్వాత మహేష్ బాబుతో అతడు, ఖలేజా లాంటి సినిమాలు చేసినప్పుడు ఆయనతో మాట్లాడాను. ఆయనతో గడిపిన ప్రతిక్షణం చాలా చాలా అమూల్యమైనది, అపురూపమైనది.
Sreeleela: మహేష్ ను చూస్తే మాట రాకపోయేది.. రోజూ తిట్టుకునేదాన్ని
అంత గొప్ప మనిషికి పుట్టినటువంటి మహేష్ ఇంకెంత అదృష్టవంతుడో అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. కృష్ణ గారి కొడుకుగా తన తండ్రి చేయలేని కొన్ని రకాల సినిమాలను కూడా చేయడానికి రెడీగా ఉండే తండ్రికి తగ్గ తనయుడు అనిపిస్తూ ఉంటుంది. ఒక సినిమాకి 100% పని చేయాల్సి ఉంటుంది అంటే 200% పనిచేసే నటుడు మహేష్ బాబు ఒక్కరే. ఈ విషయంలో తెలుగు సినీ పరిశ్రమలో ఏ ఒక్కరు వెనక్కి తిరిగి చూసే ప్రశ్న లేదు, ఈ మాట చెప్పడానికి ఎవరు వెనుకాడరు. నేను అతడు, ఖలేజా సినిమాలకు పని చేసినప్పుడు ఎలా ఉన్నారో ఈ రోజుకు కూడా అలానే ఉన్నారు. ఆయన హీరో అయి పాతికేళ్లు అవుతుందని మీరంటున్నారు కానీ నాకు మాత్రం ఆయన రెండు మూడేళ్ల క్రితం హీరోగా పరిచయమయ్యాడు అనిపిస్తూ ఉంటుంది. చూడడానికి ఎంత యంగ్ గా కనిపిస్తున్నాడో మనసులో కూడా అంతే యంగ్ గా ఉంటాడు, పర్ఫామెన్స్ విషయంలో కూడా అంతే నూతనంగా అంతే యవ్వనంతో ఉన్నాడు. ఆయనకు మరిన్ని వసంతాలు అదే యవ్వనం ఉండాలని ఆయనకు కృష్ణ గారి తరపున మీ అందరూ ఆయన వెనుక ఉండాలని ఆయన ఆశీర్వదించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ జనవరి 12వ తేదీన థియేటర్లో కలుద్దాం అన్నారు. ఈ సంక్రాంతి చాలా గొప్పగా జరుపుకుందాం ఆనందంగా జరుపుకున్నాం రమణ గాడితో కలిసి జరుపుకుందాం థాంక్యూ నమస్కారం అంటూ ముగించారు.