Sreeleela Speech at Guntur Kaaram Pre Release Event: మహేష్ బాబు, శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్లుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం గుంటూరు కారం. సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ గుంటూరులో ఘనంగా జరుగుతోంది. ఇక ఈ ఈవెంట్ లో పాల్గొన్న హీరోయిన్ శ్రీ లీల మాట్లాడుతూ ఇక్కడి రెస్పాన్స్ ఇక్కడి జనాలని చూస్తే తనకు ఇప్పుడే అర్థమవుతుంది గుంటూరు వస్తే హీరోగారు తనను ఎందుకు గుర్తుపెట్టుకోమన్నారో అంటూ మహేష్ బాబు డైలాగ్ ని గుర్తు చేసింది. గుర్తుపెట్టుకున్నా అందుకే వచ్చాను ఇప్పుడు ఇదంతా మీ అందరికీ గుర్తుండి పోతుంది, ఇంత ప్రేమ చూపిస్తున్న మీ అందరికీ థాంక్యూ సో మచ్ అని చెప్పుకొచ్చింది. ముందుగా త్రివిక్రమ్ కి థాంక్స్ చెబుతూ తనకు అమ్ము అనే క్యారెక్టర్ చేసే అవకాశం ఇవ్వడం చాలా గొప్ప విషయం అని అలాగే సెట్లో తన అల్లరి భరించినందుకు కూడా ఆమె థాంక్స్ చెప్పుకొచ్చింది. మీరు ఎన్నో పుస్తకాలు చదివి ఆ జ్ఞానాన్ని ఒక పాటలోనో, మాటలోనో, సినిమా ద్వారానో తీసుకొస్తారని అలాంటి వాటిలో తమను కూడా భాగం చేస్తున్నందుకు ఆమె ఆనందం వ్యక్తం చేసింది. రాఘవేంద్రరావు పెళ్లి సందడి తర్వాత తనకు ఇది మరొక రీ లాంచ్ లాగా అనిపిస్తుందని శ్రీ లీల చెప్పుకొచ్చింది.
Dil Raju: మహేష్-శ్రీ లీల దెబ్బకి స్క్రీన్లు చిరిగిపోతాయ్.. కలెక్షన్లతో తాట తీస్తాడు!
మహేష్ బాబుని చూస్తుంటేనే మాటలు రావడం లేదని ఈ విషయం ఆయనకు కూడా అర్థమవుతుందని పేర్కొన్న శ్రీ లీల చాలాసార్లు సెట్ లో కూడా డైలాగ్స్ మరిచి పోయేదాన్ని అయినా సరే ఓపికగా భరించినందుకు థాంక్స్ అని చెప్పుకొచ్చింది. ఇక ఆయనతో షూట్ లో పాల్గొన్న తర్వాత మొదటి రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన ఎలా ఉంటారు ఎలా బిహేవ్ చేస్తారని ఇంట్లో వాళ్ళందరూ అడిగారని ఒక బంగారు విగ్రహానికి ప్రాణం పోస్తే ఎలా ఉంటుందో మహేష్ బాబు అలాగే ఉంటారని చెప్పానని పేర్కొంది. కేవలం బయటే కాదు ఆయన మనసు కూడా బంగారమేనని శ్రీలీల పేర్కొన్నారు. నిజానికి తాను కూడా అక్కడ గ్రౌండ్ లో ఉండాల్సిన దాన్ని కానీ దేవుడు నా నోటితో కొన్ని చెప్పించాలని ఇక్కడికి(స్టేజ్ మీదకి) పంపించాడేమో అనిపిస్తుంది అని చెప్పుకొచ్చింది. కెమెరామెన్ మనోజ్ పరమహంస రెండు రోజులు చేయాల్సిన షూటింగ్ ఒక పూటలా పూర్తి చేస్తారని నేను ఒక రోజంతా వేస్ట్ అయిందని తిట్టుకుంటూ ఉండేదాన్ని అన్నారు. ఆడియన్స్ అందరికీ తాను రుణపడి ఉంటానని మొదటి అడుగు నుంచి తనకు అండగా నిలబడ్డారని శ్రీ లీల చెప్పుకొచ్చింది,. ఈ గుంటూరు కారం సంక్రాంతికి మీ ముందుకు వస్తోంది మీ అందరూ థియేటర్లకి రండి నేను మీ అమ్ము మీ అందరికీ తీపిని పంచుతాను అంటూ ముగించింది.