War 2 Pre Release Event : హృతిక్, ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న వార్-2 ఆగస్టు 14 న వస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా వచ్చిన డైరెక్టర్ త్రివిక్రమ్ మాట్లాడారు. ఎన్టీఆర్ నా అనుబంధం పాతికేళ్లు. అలాగే నేను సినిమాల్లోకి రాక ముందు కహోనా ప్యార్ హై సినిమా చూసి హృతిక్ అంటే అభిమానం ఏర్పడింది. మ్యాడ్ ఈవెంట్ లో కలిసినప్పుడు దాన్ని దేవర నామ సంవత్సరంగా చెప్పాను. ఇప్పుడు చెప్తున్నాను. ఇది హృతిక్ రోషన్-రామారావు నామ సంవత్సరంగా ప్రకటిద్దాం మనం. వారిద్దరినీ చూసేందుకు నాకు రెండు కళ్లు సరిపోవట్లేదు. ఈ సినిమాలో ఫైట్లు, యాక్షన్ ను మించిన సర్ ప్రైజ్ ఉంది. వాటి కోసం ఎన్టీఆర్ ఇక్కడిదాకా రాడు కదా. ఆయన మంచి ఎమోషన్స్ పలికించగలరు. కాబట్టి ఆయన్ను ఎలా వాడాలో అయాన్ ముఖర్జీకి తెలుసు.
Read Also : War 2 Pre Release Event : ఫ్యాన్స్ కు ఎన్టీఆర్ పాదాభివందనం
ఈ సినిమాలో మంచి, చెడ్డ అనే దాని కంటే ఇదో మంచి సినిమా అవుతుందనే నమ్మకం నాకుంది. వీరిద్దరిలో ఒకరు వింధ్య పర్వతం, ఒకరు హిమాలయ పర్వతం. అలాంటి వారిద్దరితో సినిమా చేశాడు అంటే అయాన్ కు హ్యాట్సాఫ్ చెప్పాలి. ట్రైలర్ చూస్తేనే సినిమా ఎలా ఉందో తెలిసిపోతోంది. వినాయక చవితి పండగ కంటే ముందే ఈ సినిమాతో మనకు పండగ స్టార్ట్ కాబోతోంది. ఈ సినిమాతో ఎన్టీఆర్, హృతిక్ కు భారీ హిట్ పడాలి. ఈ సినిమాతో ఎన్టీఆర్ క్రేజ్ బాలీవుడ్ లో తెలియాలి అన్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్.
Read Also : WAR 2 Pre Release Event : ఎన్టీఆర్ నాకు తమ్ముడు.. సింగిల్ టేక్ యాక్టర్.. హృతిక్ ప్రశంసలు